మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: ఈ తండ్రి కష్టం చూస్తే కన్నీళ్లాగవు.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో ఇది!

ABN, Publish Date - Feb 16 , 2024 | 07:43 PM

ఈ తండ్రి కష్టం చూస్తే కన్నీళ్లాగవు.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో ఇది!

Viral: ఈ తండ్రి కష్టం చూస్తే కన్నీళ్లాగవు.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో ఇది!

ఇంటర్నెట్ డెస్క్: బిడ్డల జీవితంలో తల్లిదండ్రుల పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! తల్లి బిడ్డలను నవమాసాలు మోసి కంటే ఆ బిడ్డలు ప్రయోజకులయ్యే వరకూ వారి భారాన్నంతా తండ్రి తనపైనే వేసుకుంటాడు. ఎన్నో త్యాగాలు చేస్తాడు (Father's sacrifices for Family). కానీ తన కష్టనష్టాలను బిడ్డలతో పంచుకోడు. దురదృష్టవశాత్తూ.. చాలా సందర్భాల్లో తండ్రి గొప్పతనం గురించి బిడ్డలకు తెలిసే సరికి చాలా ఆలస్యమైపోతుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే..నెట్టింట ఓ వీడియో నెటిజన్లకు తమ తల్లిదండ్రులను గుర్తు చేస్తోంది. ముఖ్యంగా తండ్రి పడ్డ కష్టాలను గుర్తు చేసుకుంటూ అనేక మంది భావోద్వేగానికి లోనయ్యారు (Video of a hardworking man goes viral).

Viral: ఈ ఏనుగుది ఎంతటి జాలి గుండె? సింహం పిల్లల్ని చంపే గోల్డెన్ ఛాన్స్ వచ్చినా కూడా..


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వ్యక్తి ఇలాగే తన కుటుంబం కోసం కష్టపడుతున్న తీరు నెటిజన్లతో కన్నీళ్లు పెట్టిస్తోంది. రైల్లో ప్రయాణిస్తున్న అతడు సీటు కూడా దొరక్కపోవడంతో ఫ్లోర్‌పై కూర్చుని భోజనం చేశాడు. ప్రశాంతంగా తినే టైం కూడా లేక ప్రయాణంలోనే భోజనం చేశాడు. భార్యాబిడ్డల కోసం అతడు పడుతున్న కష్టం నెటిజన్లను అమితంగా కదిలించింది. దీంతో, ఈ వీడియో వైరల్‌గా (Viral Video) మారింది.

ViralVideo: ఎవరు బ్రో నువ్వు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు.. నెటిజన్లను షేక్ చేస్తున్న వీడియో ఇది!

వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. తమ కోసం అమ్మానాన్నలు పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. బిడ్డలకు తండ్రి మనౌంగానే అనేక త్యాగాలు చేస్తాడన్నారు. ప్రతి కుటుంబంలో అసలు హీరో తండ్రేనంటూ కామెంట్ చేశారు. తమ తండ్రి బతికుండంగా ఆయనకు ఏమీ చేయలేకపోయామని కొందరు బాధపడ్డారు. తను ఆరిపోతూ కూడా వెలుగునిచ్చే దీపం లాంటి వాడే తండ్రి అని కామెంట్ చేశారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 16 , 2024 | 07:50 PM

Advertising
Advertising