ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: ఇది మామూలు పక్షి ఈక అనుకుంటున్నారా? దీని ఖరీదు 25 తులాల బంగారం కంటే ఎక్కువ.. కారణమేంటంటే..

ABN, Publish Date - May 24 , 2024 | 10:14 AM

ఈ ప్రపంచంలో ఎన్నో రకాల పక్షి జాతులు ఉన్నాయి. వేటికవే తమ తమ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. పక్షి ఈకల్లో నెమలికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. నెమలి ఈకలు ఎంతో అందంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే నెమలి ఈకను మించిన ప్రత్యేకమైన ఈక ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

Huia bird feather

ఈ ప్రపంచంలో ఎన్నో రకాల పక్షి జాతులు ఉన్నాయి. వేటికవే తమ తమ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. పక్షి ఈకల్లో నెమలికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. నెమలి ఈకలు ఎంతో అందంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే నెమలి ఈకను మించిన ప్రత్యేకమైన ఈక ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఎందుకంటే ఆ పక్షి ఈక (Bird feather) ఖరీదు అక్షరాలా 23 లక్షల రూపాయలు. అంటే 25 తులాల బంగారం కంటే ఎక్కువ ఖరీదు (Expensive feather). ఒక్క ఈకకు అంత ఖరీదు ఎందుకో తెలుసా? (Viral News)


ఈ ఈక న్యూజిలాండ్‌ (New Zealand)లో సంచరించే హుయియా పక్షికి (Huia bird) చెందినది. ఆ పక్షి జాతి ఇప్పుడు అంతరించిపోయింది. ఎంతో అందమైన ఈ పక్షులను అందరూ ఇష్టపడేవారు. వాటి ఈకలు కూడా చూడటానికి చాలా అందంగా, ప్రత్యేకంగా ఉంటాయి. దీంతో ఆ అంతరించిపోయిన పక్షికి సంబంధించిన ఓ ఈకను న్యూజిలాండ్‌కు చెందిన వెబ్ ఆక్షన్ హౌస్ ఈ నెల 20న వెబ్ వేలం వేసింది (Huia bird feather). రూ.1.53 లక్షలను ఈ ఈకకు వేలం ధరగా నిర్ణయించింది. అయితే ఎవరూ ఊహించనంతంగా ఈ ఈకకు ఏకంగా రూ.23 లక్షలకు పైగా ధర పలకడం అందరికీ షాక్ కలిగించింది.


న్యూజిలాండ్‌లోని మవోరీ జాతి ప్రజలు హుయియా పక్షిని దైవంగా భావిస్తారు. ఆ తెగ పెద్దలు ఆ పక్షి ఈకలను తమ కిరీటాలలో ధరిస్తారు. అంతేకాదు ఈ ఈకలను అప్పట్లో అమ్ముకునే వారు. ఒకరికొకరు బహుమతులుగా ఇచ్చి పుచ్చుకునే వారు. అయితే ఆ పక్షులు క్రమంగా అంతరించి పోయాయి. చివరి సారిగా 1907లో ఓ హాయియా పక్షి కనిపించినట్టు రికార్డులను బట్టి తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి..

Viral Video: దేవుడా.. ఈ వంటకం ఏంటో తెలిస్తే కంట్లో నీళ్లు తిరగాల్సిందే.. అవాక్కవుతున్న నెటిజన్లు!


Viral Video: ఎండలో నడిరోడ్డుపై ఆమ్లెట్ వేసిన మహిళ.. నెటిజన్లు ఎందుకు విమర్శలు చేస్తున్నారంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 24 , 2024 | 10:14 AM

Advertising
Advertising