Viral Video: ఈమె ఒక వర్గానికి ఇన్‌స్పిరేషన్.. వర్షంలో నిల్చుని ఏం చేస్తోందో చూడండి.. నవ్వాపుకోలేరు..
ABN, Publish Date - Nov 05 , 2024 | 07:49 AM
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రతిరోజు ఎన్నో వీడియోలో మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని మనల్ని విపరీతంగా నవ్విస్తుంటాయి. కొందరు ఒక్కోసారి సిల్లీగా ప్రవర్తిస్తూ కెమెరాకు దొరికిపోతుంటారు. మరికొందరు కావాలనే రీల్స్ కోసం విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రతిరోజు ఎన్నో వీడియోలో మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని మనల్ని విపరీతంగా నవ్విస్తుంటాయి. కొందరు ఒక్కోసారి సిల్లీగా ప్రవర్తిస్తూ కెమెరాకు దొరికిపోతుంటారు. మరికొందరు కావాలనే రీల్స్ (Reels) కోసం విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ మహిళ ఎందుకోసం అలా చేసిందో తెలియదు కానీ, ఆమె చేసిన పని మాత్రం సోషల్ మీడియా జనాలకు విపరీతంగా నవ్వు తెప్పిస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
comedy_.central_.hyd అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ తన ఇంటి ముందు ప్రాంతాన్ని కడుగుతోంది (Cleaning). పైప్‌తో నీరు (Water) చిమ్ముతూ అంతా క్లీన్ చేస్తోంది. విశేషమేమిటంటే.. ఆ సమయంలో జోరుగా వర్షం (Rain) కురుస్తోంది. వర్షంలో తడుస్తూనే ఆమె తన ఇంటిని నీటితో క్లీన్ చేసేస్తోంది. వర్షం పడుతుండగా మళ్లీ నీటితో క్లీన్ చేస్తున్న ఆమె తెలివితేటలపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 30 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 2.6 లక్షల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆమె బ్రెయిన్ వేరే గ్రహానికి చెందినది అయి ఉంటుంది``, ``వాటర్ వేస్ట్ ప్రో మ్యాక్స్``, ``ఆమె ఒక మహిళ. ఆమె ఏమైనా చేయగలదు``, ``ఆమె మెదడు మోకాళ్లలో ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: అందరికీ ఇలాంటి టీచర్ ఉండాలి.. క్లాస్‌రూమ్‌లో పిల్లలకు ఎలా పాఠం చెబుతున్నారో చూడండి..
Hijab protest: ఇరాన్‌లో హిజాబ్‌పై నిరసన.. బహిరంగంగా బట్టలు విప్పి తిరగిన మహిళ.. వీడియో వైరల్..
Optical Illusion Test: మీ బ్రెయిన్ షార్ప్ అయితేనే.. ఈ సీతాకోక చిలుకల మధ్యనున్న చీమను పట్టుకోగలరు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Nov 05 , 2024 | 07:49 AM