ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: ఏడాదికి రూ.25 లక్షల జీతం.. అయినా మిగలడం లేదట.. వ్యక్తి ఖర్చులు ఏంటంటే

ABN, Publish Date - Oct 25 , 2024 | 04:02 PM

సౌరవ్ దత్తా అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టాడు. తన దృష్టిలో కుటుంబాన్ని నడిపించేందుకు రూ.25 లక్షలు చాలా చిన్న మొత్తమని అతడు వ్యాఖ్యానించాడు. అతడి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆసక్తికరంగా స్పందించారు.

Salary

ఓ వ్యక్తి జీతం రూపంలో ఏడాదికి ఏకంగా రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడు. కానీ కుటుంబాన్ని పోషించడానికి ఈ జీతం చాలా తక్కువని, సేవింగ్స్ చేసుకోవడానికి ఏమీ మిగలడం లేదని అతడు తెగ బాధపడుతున్నాడు. తన ఆవేదనను వర్ణిస్తూ ‘ఎక్స్’ వేదికగా అతడు పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.


సౌరవ్ దత్తా అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఈ ఆసక్తికర పోస్టు పెట్టాడు. తన దృష్టిలో కుటుంబ నిర్వహణకు రూ.25 లక్షలు చాలా చిన్న మొత్తమని వ్యాఖ్యానించాడు. ‘‘నెలకు లక్షన్నర జీతం వస్తోంది. కుటుంబంలో ముగ్గురు సభ్యులం ఉన్నాం. ఇంట్లో నిత్యావసరాలు, ఈఎంఐ, అద్దెలకు కలిపి లక్ష రూపాయలు ఖర్చు అవుతోంది. భోజనం, సినిమాలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఛార్జీలు, రోజువారీ ట్రిప్‌లు వీటన్నింటికి రూ.25 వేలు పోతోంది. అత్యవసరాలు, మెడికల్ కోసం మరో రూ.25 వేలు అవుతోంది. ఏదైనా పెట్టుబడి పెడదామంటే ఏమీ మిగలడం లేదు’’ అని సౌరవ్ దత్తా రాసుకొచ్చాడు.


అతడు పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. చాలా మంది నెటిజన్లు స్పందించారు. అందులో కొందరు దత్తా వాదనతో ఏకీభవించారు. మరికొందరు అతడి అభిప్రాయాన్ని తప్పుబట్టారు. కుటుంబంలో ముగ్గురే ఉండి కూడా ఏడాదికి రూ.25 లక్షల జీతం చాలా తక్కువని చెప్పడంపై మండిపడుతున్నారు.


ఓ వ్యక్తి స్పందిస్తూ.. ఎలాంటి అప్పులు లేకుండా, జాగ్రత్తగా ఖర్చులు పెట్టి, మంచి అలవాట్లు ఉంటే కొన్నేళ్లలోనే ధనవంతులు కావొచ్చు’’ అని వ్యాఖ్యానించాడు. “మమ్మల్ని ఏం చేయమంటావ్ మరి?. నెటిజన్ల దృష్టిని ఆకర్షించేందుకు ఇలాంటి ట్వీట్లు’’ అని ఓ వ్యక్తి మండిపడ్డాడు.

‘‘ మెడికల్ ఖర్చుల కోసం నెలకు రూ.25 వేలు, ఇంట్లో భోజనం, రోజువారీ ట్రిప్‌లు ఇలాంటి వాటి కోసం మరో రూ.25 వేలు. ఏ కుటుంబమూ ఇలాంటి ఖర్చులు చేయదు. దయచేసి జోక్స్ వేయకండి. జనాల్ని నమ్మించకండి’’ అని మూడవ వ్యక్తి పేర్కొన్నాడు. ‘‘బయట తినడానికి, ఓటీటీలు, సినిమాల కోసం నెలకు రూ.25 వేలు ఖర్చు చేయాలనుకుంటున్నారు. ఇక సేవ్ చేయడానికి ఏమీ మిగిల్లేదని అంటున్నారు. భారతీయులు భలే విచిత్రంగా ఉన్నారే’’ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.


‘‘మీ జీవనశైలిని చూస్తుంటే రూ.50 లక్షలు కూడా సరిపోయేలా లేవు కదా. మీరు సంపాదించే దాని కంటే ఖర్చులే ఎక్కువగా ఉన్నాయి” అని మరొకరు వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. “ రూ.75 వేలలోపు జీతంతో కుటుంబాన్ని ఈజీగా నడిపించవచ్చు. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారే. సినిమాలు, ఓటీటీలు, రోజువారీ ట్రిప్‌‌లు, బయట భోజనాల కోసం రూ.25 వేలు, ప్రతి నెలా అత్యవసర వైద్య ఖర్చుల కోసం రూ.25 వేలు ఎవరికి అవసరం?’’ అని మరో నెటిజన్ ప్రశ్నించాడు.


కాగా మన దేశంలో ఒక కుటుంబాన్ని నడపడానికి ఎంత డబ్బు అవసరం అవుతుందని ప్రశ్నిస్తే.. ఇంతకావాలని అంచనా వేయలేం. ఎందుకంటే కుటుంబ సభ్యుల సంఖ్య, వారి ఖర్చులు, వారి జీవనశైలి వంటి వివిధ అంశాలు ఆధారంగా ఆ కుటుంబ వ్యయం ఆధారపడి ఉంటుంది.


ఇవి కూడా చదవండి

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు 2024లో మతిపోగొట్టే ఇంక్రిమెంట్

బాలయ్య పండుగకు సెలవు కావాలి.. ఇదేందయ్యా ఇది

Updated Date - Oct 25 , 2024 | 04:13 PM