Millionaire: భార్య ఫోన్ కాల్‌తో కోటీశ్వరుడైన భర్త.. అంతలోనే ఊహించని బిగ్ ట్విస్ట్..!
ABN, Publish Date - Feb 26 , 2024 | 09:56 AM
Share Markets: షేర్ మార్కెట్ క్రేజ్ మామూలుగా ఉండదు. షేర్ మార్కెట్‌లో డబ్బులు ఇన్వెస్ట్(Investments) చేసి.. భారీగా డబ్బు సంపాదించాలని అందరూ భావిస్తుంటారు. అయితే, మార్కెట్‌ను అర్థం చేసుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. మార్కెట్‌లో(Share Markets) రాణించాలంటే సరైన అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఎవరికి ఉంటే వారు డబ్బు సంపాదిస్తారు.
Share Markets: షేర్ మార్కెట్ క్రేజ్ మామూలుగా ఉండదు. షేర్ మార్కెట్‌లో డబ్బులు ఇన్వెస్ట్(Investments) చేసి.. భారీగా డబ్బు సంపాదించాలని అందరూ భావిస్తుంటారు. అయితే, మార్కెట్‌ను అర్థం చేసుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. మార్కెట్‌లో(Share Markets) రాణించాలంటే సరైన అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఎవరికి ఉంటే వారు డబ్బు సంపాదిస్తారు. అయితే, ఒక్కడ ఓ వ్యక్తి మాత్రం తప భార్య నుంచి వచ్చిన ఒక్క ఫోన్ కాల్‌తో కోటీశ్వరుడు అయ్యాడు. కానీ, అంతలోనే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుని బిక్క మొహం పెట్టుకోవాల్సి వచ్చింది. మరి ఒక్క ఫోన్ కాల్‌తో కోటీశ్వరుడు ఎలా అయ్యాడు? ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలేంటి? అనే ఇంట్రస్టింగ్ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
ఒక్క ఫోన్ కాల్‌తో..
అమెరికాకు చెందిన టైలర్ లౌడన్.. తన భార్య ఫోన్ తరువాత కోటీశ్వరుడు అయ్యాడు. రూ. 15 కోట్ల లాభం పొందాడు. అదెలాగంటే.. లౌడన్ భార్య బీపీపీఎల్‌సీ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తోంది. అయితే, ఈ కంపెనీ ట్రావెల్ సెంటర్స్ ఆఫ్ అమెరికా ఇంక్‌తో విలీనానికి సిద్ధమైంది. ఈ విషయం బీపీపీఎల్‌సీ కంపెనీ మేనేజర్ అయిన లౌడన్ భార్యకు తెలుసు. ఒక రోజు ఆమె ఇంటి నుంచి పని చేస్తుండగా.. సహోద్యోగులతో ఫోన్ కాల్ మాట్లాడుతోంది. కంపెనీ విలీనం గురించి ఫోన్‌లో డిస్కస్ చేసింది. ఈ మాటలను విన్న లౌడన్.. తన గేమ్ స్టార్ట్ చేశాడు. వాస్తవానికి కంపెనీల విలీనానికి సంబంధించిన వార్తలు ఇంకా మార్కెట్‌లోకి రాలేదు. కేవలం తన భార్య మాటల ద్వారా విన్న లౌడన్.. వెంటనే షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాడు. ట్రావెల్ సెంటర్స్ ఆఫ్ అమెరికా ఇంక్‌లో నెలల తరబడి షేర్స్ కొనుగోలు చేస్తూ వచ్చాడు. అయితే, ఇటీవల ఈ రెండు కంపెనీలు విలీనం అయ్యాయి. ఫలితంగా లౌడన్ 1.76 మిలియన్ల లాభం పొందాడు. ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 15 కోట్లు.
విషయం తెలిసిన భార్య ఏం చేసిందంటే..
తన భర్త తన మాటలు రహస్యంగా విని.. కంపెనీ షేర్స్ కొనుగోలు చేశాడని లౌడన్ భార్య గుర్తించింది. తన భర్త చర్యకు ఆగ్రహించిన మహిళ.. ఆగ్రహంతో అతన్ని విడిచి వెళ్లిపోయింది. అంతేకాదు.. ఈ విషయం కంపెనీకి తెలియగా.. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. మహిళ తన భర్తకు కావాలనే మొత్తం సమాచారం ఇచ్చిందని కంపెనీ అభిప్రాయ పడింది. కాగా, కంపెనీలో షేర్స్ కొనుగోలు చేసిన లౌడన్‌తో యాజమాన్యం ఒక సెటిల్‌మెంట్ చేసుకుంది. చేసిన తప్పునకు జరిమానా చెల్లించేందుకు అంగీకారం చేసుకున్నారు. దాంతో అతగాడి గేమ్ క్లోజ్ అయ్యింది.
మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Feb 26 , 2024 | 09:56 AM