ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఇక ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందేనా? సింహం నుంచి తప్పించుకునేందుకు చెట్టెక్కిన తర్వాతేం జరిగిందో చూడండి..

ABN, Publish Date - Jun 03 , 2024 | 02:16 PM

అడవిలో సింహాన్ని మించిన అత్యంత క్రూరమైన వేటగాడు ఇంకెవరూ ఉండరు. ఒకసారి ఏ జంతువు మీదైనా కన్నేస్తే దానిని అత్యంత క్రూరంగా చంపి తన ఆకలి తీర్చుకుంటుంది. సింహం నుంచి తప్పించుకోవడం ఏ జంతువుకైనా దాదాపు అసాధ్యం. ఇక, మనుషుల సంగతి చెప్పనే అక్కర్లేదు.

Lion

అడవిలో సింహాన్ని (Lion) మించిన అత్యంత క్రూరమైన వేటగాడు ఇంకెవరూ ఉండరు. ఒకసారి ఏ జంతువు మీదైనా కన్నేస్తే దానిని అత్యంత క్రూరంగా చంపి తన ఆకలి తీర్చుకుంటుంది. సింహం నుంచి తప్పించుకోవడం ఏ జంతువుకైనా దాదాపు అసాధ్యం (Lion Videos). ఇక, మనుషుల సంగతి చెప్పనే అక్కర్లేదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే. సఫారీ టూర్‌కు వెళ్లిన వ్యక్తి సింహం కంట్లో పడ్డాడు. దాని నుంచి తప్పించుకునేందుకు చెట్టు (Tree) ఎక్కి కూర్చున్నాడు (Viral Video).


@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి సింహం నుంచి తప్పించుకునేందుకు అడవిలోని ఓ చెట్టు ఎక్కినట్టు తెలుస్తోంది. ఆ సింహం కూడా ఆ చెట్టు ఎక్కడానికి ప్రయత్నించింది. రెండు, మూడు సార్లు ప్రయత్నించి విరమించుకుంది. అయితే అక్కడి నుంచి కదలకుండా ఆ చెట్టు మొదలు దగ్గరే కూర్చుంది. కొద్దిసేపటికి మరిన్ని సింహాలు అక్కడకు చేరుకున్నాయి. ఇందులో విశేషం ఏంటంటే.. ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తి వీడియో తీస్తూనే ఉన్నాడు.


``ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారు`` అంటూ ఆ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 18 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను వీక్షించారు. 5.5 వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఇది నిజమేనా?``, ``ఆ వ్యక్తి ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే``, ``తర్వాత ఏం జరిగింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: గాల్లో ఉండగా విమానం తలుపు తెరిచేందుకు ప్రయత్నించిన వ్యక్తి.. సిబ్బంది వారిస్తున్నా వినకుండా..


Viral: ఇంట్లోకి దూరి దొంగతనం చేశాడు.. ఏసీ ఆన్ చేసి నిద్రలోకి జారుకున్నాడు.. పోలీసులు నిద్రలేపితే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 03 , 2024 | 02:16 PM

Advertising
Advertising