ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఏం తెలివి గురూ.. బైక్‌ను ఆటోలా మార్చి ఐదుగురిని తీసుకెళ్తున్నాడు.. జుగాడ్ వీడియో వైరల్..

ABN, Publish Date - Aug 31 , 2024 | 05:35 PM

తెలివి తేటలు ఉండాలే గానీ, శూన్యం నుంచి కూడా అద్భుతాలు సృష్టించవచ్చు. ఎంత పెద్ద సమస్యకైనా సులభమైన పరిష్కార మార్గం కనుగొనవచ్చు. అవసరమే అద్భుత ఆవిష్కరణలకు కారణమవుతుంది. అత్యంత సామాన్యులు అరుదైన ఆవిష్కరణలు చేసి అందరినీ ఆకట్టుకుంటుంటారు.

Bike auto

తెలివి తేటలు (Intellegence) ఉండాలే గానీ, శూన్యం నుంచి కూడా అద్భుతాలు సృష్టించవచ్చు. ఎంత పెద్ద సమస్యకైనా సులభమైన పరిష్కార మార్గం కనుగొనవచ్చు. అవసరమే అద్భుత ఆవిష్కరణలకు (Innovations) కారణమవుతుంది. అత్యంత సామాన్యులు అరుదైన ఆవిష్కరణలు చేసి అందరినీ ఆకట్టుకుంటుంటారు. అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు (Jugaad Videos) ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలోని వ్యక్తి బైక్‌ను ఆటోలా మార్చి ఐదుగురిని తీసుకువెళ్తున్నాడు (Viral Video).


@NaushadVibe అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి తన బైక్‌‌ను ఆటోలా మార్చేశాడు. బైక్‌ (Bike)కు ఓ టాప్, కొన్ని ఐరన్ రాడ్లను వెల్డింగ్ చేసి సీట్లు కూడా ఏర్పాటు చేశాడు. తను కాకుండా ఐదుగురు కూర్చొనేలా బ్యాలెన్స్‌డ్‌గా సీట్లు ఏర్పాటు చేశాడు. ఆ సీట్లలో ఐదుగురిని ఎక్కించుకుని బైక్ రైడింగ్ ప్రారంభించాడు. చక్కగా రోడ్డు మీద ప్రయాణించాడు. ఆ వీడియో ఎప్పుడు, ఎక్కడ రికార్డు చేశారో స్పష్టత లేదు గానీ, ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 10 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వావ్, వాట్ ఎ టాలెంట్``, ``ఇది నిజమైన దేశీ జుగాడ్``, ``ఇది వీడియోల కోసమే, నిజంగా వర్కవుట్ కాదేమో``, ``బ్యాలెన్స్ తప్పితే చాలా ప్రమాదం``, ``ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: అది చెయ్యా? ఉక్కు కడ్డీనా? ట్రాక్టర్ పైకి ఎక్కించుకుని ఆ వ్యక్తి చేసిన స్టంట్ చూస్తే షాకవ్వాల్సిందే..


Brain Teaser: మీ ఐక్యూ లెవెల్‌ను టెస్ట్ చేసుకోండి.. ఈ ఫ్రిడ్జ్‌లో ఉండకూడని 10 వస్తువులను కనిపెట్టండి..!


Viral Video: కిడ్నాపర్‌‌ను వదిలిరానని బాలుడి ఏడుపు.. బలవంతంగా అమ్మ దగ్గరకు చేర్చిన పోలీసులు..


Viral Video: నాగుపాము పకోడీ.. ఇండోనేసియాలో స్నేక్ స్నాక్స్‌కు భారీ డిమాండ్.. ఆ షాప్‌లో పాములతో ఏం చేస్తున్నారంటే..


Viral Video: వార్నీ.. మ్యాంగో జ్యూస్ ఇలా తయారు చేస్తారా.. ఈ వీడియో చూశాక కూడా తాగారంటే మీకు హ్యాట్సాఫ్..



మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 31 , 2024 | 05:35 PM

Advertising
Advertising