ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అదృష్టం అంటే ఇదే.. కూర్చున్న వ్యక్తి లేచి పక్కకు వెళ్లగానే ఏం జరిగిందో చూడండి..

ABN, Publish Date - Jul 26 , 2024 | 11:18 AM

అదృష్టం మీ వైపు ఉంటే, ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు. దేవుడు మిమ్మల్ని రక్షించాలని కోరుకుంటే, ఎంతటి ప్రమాదం నుంచైనా సులభంగా తప్పించుకోవచ్చు. ఏంటి? నమ్మడం లేదా? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే నమ్మి తీరాల్సిందే.

A man narrowly escaped from an accident

అదృష్టం (Luck) మీ వైపు ఉంటే, ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు. దేవుడు మిమ్మల్ని రక్షించాలని కోరుకుంటే, ఎంతటి ప్రమాదం నుంచైనా సులభంగా తప్పించుకోవచ్చు. ఏంటి? నమ్మడం లేదా? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే నమ్మి తీరాల్సిందే. ఆ వీడియోలోని ఓ వ్యక్తి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. లేకపోతే ఫ్యాన్ (Fan) తలపై పడి తీవ్ర ప్రమాదానికి గురయ్యేవాడు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


వైరల్ అవుతున్న ఈ వీడియో పాకిస్తాన్‌ (Pakistan)కు చెందినది. ఆ వీడియో పాకిస్తాన్‌లోని ఓ దుకాణంలో ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. ఆ వీడియో ప్రకారం.. షాప్‌లో ఓ వ్యక్తి సోఫాలో కూర్చున్నాడు. పైన సీలింగ్ ఫ్యాన్ వేగంగా తిరుగుతోంది. కొద్ది సేపటి తర్వాత ఆ వ్యక్తి అక్కణ్నుంచి లేచి పక్కకు వెళ్లాడు. వెంటనే సీలింగ్ ఫ్యాన్ పెద్ద శబ్దంతో కిందన పడింది. సరిగ్గా అతడు కూర్చున్న చోటే పడింది. అతడు కానీ అక్కడ ఉండుంటే తీవ్ర ప్రమాదానికి గురయ్యేవాడు. అతడు వెళ్లేవరకు ఆగిన ఆ ఫ్యాన్ తర్వాత కింద పడింది. ఆ వ్యక్తి ఎంతో ఆశ్చర్యపోయాడు.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు 50 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 15 లక్షల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అల్లా అతనికి మరో అవకాశం ఇచ్చాడు``, ``అదృష్టం అంటే అదే``, ``అదృష్టం మన వైపు ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీ కళ్ల పవర్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ పజిల్‌ను 10 సెకెన్లలో పరిష్కరించండి.. ``5``ల మధ్య ఉన్న ఆంగ్ల అక్షరాన్ని వెతకండి..!


Viral Video: జింకను సులభంగానే చంపేసింది కానీ, దానిని తీసుకెళ్లడానికి పులి ఎన్ని ఆపసోపాలు పడుతోందో చూడండి..!

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 26 , 2024 | 11:18 AM

Advertising
Advertising
<