Viral Video: వావ్.. హిప్పోలు కూడా ఇంత బుద్ధిగా ఉంటాయా? పళ్లు తోముతుంటే హిప్పో ఏం చేసిందో చూడండి..
ABN, Publish Date - Sep 27 , 2024 | 08:51 AM
మనుషులతో సాంగత్యం ఉన్న జంతువులు తప్ప మిగిలినవేవీ శుభ్రత గురించి పట్టించుకోవు. క్రూర జంతువులైతే శుభ్రతకు ఆమడ దూరంలో ఉంటాయి. పళ్లు తోముకోవడం, స్నానం చేయడం వాటికి జరగని పని. జంతు ప్రదర్శనశాలలో ఉండే జంతువుల విషయంలో అక్కడి కేర్ టేకర్లు జాగ్రత్తలు తీసుకుంటారు.
మనుషులతో సాంగత్యం ఉన్న జంతువులు (Animals) తప్ప మిగిలినవేవీ శుభ్రత గురించి పట్టించుకోవు. క్రూర జంతువులైతే శుభ్రతకు (Cleaning) ఆమడ దూరంలో ఉంటాయి. పళ్లు తోముకోవడం, స్నానం చేయడం వాటికి జరగని పని. జంతు ప్రదర్శనశాలలో ఉండే జంతువుల విషయంలో అయితే అక్కడి కేర్ టేకర్లు జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా వన్య ప్రాణులకు (Wild Animals) పళ్లు తోమడం అనేది కలలో కూడా ఊహించని విషయం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఓ వ్యక్తి హిప్పోకు (Hippopotamus) బ్రష్ (Brush)తో పళ్లు తోమాడు (Viral Video).
@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి హిప్పోపొటామస్ పదునైన దంతాలను చాలా సౌకర్యవంతంగా శుభ్రం చేస్తున్నాడు. స్పాంజ్ బ్రష్‌తో హిప్పో పళ్లను పాలిష్ చేస్తున్నాడు. మరో చేత్తో పైప్ పట్టుకుని నీటిని హిప్పో నోటిలోకి కొడుతున్నాడు. ఆ సమయంలో, హిప్పో తన సంరక్షకునికి పూర్తి మద్దతుగా నిలిచింది. నోరు తెరిచి ప్రశాంతంగా నిల్చుని ఉండిపోయింది. దీంతో ఆ వ్యక్తి చాలా సులభంగా తన పని పూర్తి చేశాడు. ఈ క్లీనింగ్ ప్రాసెస్‌ను అక్కడి వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 5 లక్షల మందికి పైగా వీక్షించారు. 4.6 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``మన పిల్లలు కూడా ఇంత ప్రేమతో పళ్ళు శుభ్రం చేసుకోరు``, ``ఆ హిప్పో దానిని ఆస్వాదిస్తోంది``, ``ఈ హిప్పో చాలా శుభ్రంగా ఉంది``, ``ఆ హిప్పో ఎంత శ్రద్ధగా పళ్లు తోమించుకుంటోందో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral News: 11 సంవత్సరాల తర్వాత ఇంటికొచ్చాడు.. అసలేం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..
Picture Puzzle: మీరు పజిల్ స్పెషలిస్టులా?.. ఈ వర్డ్ పజిల్‌లోని ``IRON``ను 8 సెకెన్లలో కనుక్కోండి...
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Sep 27 , 2024 | 08:51 AM