Viral Video: సింహం అక్కడ ఉండాల్సింది కాదు.. సింహంతో ఓ వ్యక్తి ఎలా ఆడుతున్నాడో చూడండి.. వీడియో వైరల్..
ABN, Publish Date - Oct 12 , 2024 | 04:55 PM
సింహాలు, పులులు, ఎలుగుబంట్లు వంటి క్రూర జంతువులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ అర్థం కాదు. అందుకే చాలా మంది వాటి జోలికి వెళ్లరు. అయితే కొన్ని దేశాల్లో ప్రజలు క్రూర జంతువులను తమ పాటు ఇళ్లలో పెంచుకుంటున్నారు.
వన్య మృగాలకు (Wild Animals) ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సింహాలు, పులులు, ఎలుగుబంట్లు వంటి క్రూర జంతువులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ అర్థం కాదు. అందుకే చాలా మంది వాటి జోలికి వెళ్లరు. అయితే కొన్ని దేశాల్లో ప్రజలు క్రూర జంతువులను తమతో పాటు ఇళ్లలో పెంచుకుంటున్నారు. సింహాలు (Lion), పులులను (Tiger) పెంచుకోవడం స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. దుబాయ్ (Dubai) వంటి దేశాల్లోని ధనికులు పులులు, సింహాలను పెంపుడు జంతువుల్లా చూసుకుంటున్నారు. అలాంటి ఎన్నో వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (Viral Video).
miansaqib363 అనే కంటెంట్ క్రియేటర్ తాజాగా షేర్ చేసిన ఓ వీడియో చూస్తే షాక్ అవక తప్పదు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో షాకిబ్ అనే కంటెంట్ క్రియేటర్ తన ఇంటి ఆవరణలో సింహం (Pet Lion)తో ఆడుకుంటున్నాడు. సింహాన్ని పట్టుకుని ఎలాంటి భయమూ లేకుండా ఆడుతున్నాడు. సింహం కూడా అతడితో ప్రశాంతంగా కలిసి నడుస్తోంది. సింహం కొంచెం కూడా దూకుడుగా ప్రవర్తించలేదు. ఆ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. అయితే అడవికి రారాజు అయిన సింహం పరిస్థితిపై జాలి కురిపిస్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. 25 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``పాపం.. ఆ సింహం అక్కడ ఉండాల్సింది కాదు``, ``తను అడవికి రారాజు.. ఇలా ఆడితే ప్రమాదమే``, ``వీడియో అద్భుతంగా ఉంది. అలాగే ఆందోళన కూడా కలిగిస్తోంది``, ``సింహంతో అద్భుతమైన బంధం. కానీ, ఆ బంధం వెనుక ఉన్న ప్రమాదాన్ని విస్మరించకూడదు``, ``వన్య ప్రాణులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Oct 12 , 2024 | 04:55 PM