Viral Video: సింహంతో ఆ ఆటలేంటి బాసూ.. సింహం దవడలను ఓపెన్ చేయడానికి ఆ వ్యక్తి ప్రయత్నిస్తే..
ABN, Publish Date - Oct 20 , 2024 | 01:36 PM
సింహం గాండ్రింపు, దాని పంజా దెబ్బ అత్యంత భయంకరంగా ఉంటాయి. అయితే అలాంటి సింహాలను ప్రస్తుతం చాలా మంది పెంపుడు జంతువులుగా మార్చేసుకుంటున్నారు. దుబాయ్ వంటి దేశాల్లో ధనికులు సింహాలను, పులులను పెంచుకోవడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు.
సింహం (Lion) అంటే అడవికి రారాజు. సింహాన్ని చాలా క్రూరమైన, శక్తివంతమైన జంతువుగా పరిగణిస్తారు. ఆకలి వేసినపుడు సింహం ఏ జంతువును వేటాడాలనుకుంటుందో అది దానికి ఆహారం కావాల్సిందే. సింహం గాండ్రింపు, దాని పంజా దెబ్బ అత్యంత భయంకరంగా ఉంటాయి. అయితే అలాంటి సింహాలను ప్రస్తుతం చాలా మంది పెంపుడు జంతువులుగా (Pet Lions) మార్చేసుకుంటున్నారు. దుబాయ్ (Dubai) వంటి దేశాల్లో ధనికులు సింహాలను, పులులను పెంచుకోవడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ (Pakistan)లో కూడా ఇలాంటి ట్రెండ్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది (Viral Video).
పాకిస్తాన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ షకీబ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో miansaqib363లో ఓ వీడియోను పంచుకున్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. షకిబ్ ఇంటి ఆవరణలో పెంపుడు సింహాల కోసం బోనులు ఏర్పాటు చేశారు. ఒక సింహం బయటకు వచ్చి షకీబ్‌తో కలిసి ఆడుతోంది. ఇద్దరూ చాలా సన్నిహితంగా కలిసి నడిచారు. అనంతరం షకీబ్ ఆ సింహం దవడల పట్టుకుని సాగదీశాడు. అయినా ఆ సింహం చాలా ప్రశాంతంగా ఉండిపోయింది. తన సహజ ధోరణిలో దూకుడుగా ప్రవర్తించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియోకు లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ``శౌర్యానికి, మూర్ఖత్వానికి మధ్య వ్యత్యాసం ఉంది``, ``క్రూర జంతువులు ఎప్పుడెలా ప్రవర్తిస్తాయో ఎవరికీ తెలియదు``, ``అడవికి రారాజుతో అలా ప్రవర్తించడం చాలా దారుణం``, ``అతడు సింహాన్ని కుక్కలా మార్చేశాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: మృత్యువు నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు.. ఫోన్ చూసుకుంటూ ముందుకు వెళ్లిపోతే..
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఒకేసారి మూడు పాములను ఎలా బయటకు వదులుతోందో చూడండి.. !
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Oct 20 , 2024 | 01:36 PM