ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

200 Year Old Message: గాజు సీసాలో 200 ఏళ్ల నాటి సందేశం.. పురావస్తు శాఖ తవ్వకాల్లో లభ్యం

ABN, Publish Date - Sep 23 , 2024 | 11:13 AM

దాదాపు 200 ఏళ్ల క్రితం ఒక పురావస్తు శాస్త్రవేత్త గాజు సీసాలో పెట్టిన సందేశం తాజాగా బయటపడింది. ఫ్రాన్స్‌లోని నార్మాండీ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టిన ఒక వలంటీర్లు సమూహానికి ఈ బాటిల్‌ దొరికింది. అత్యవసర తవ్వకాలు చేపడుతుండగా ఈ వారంలోనే సందేశం లభ్యమైందని వారు పేర్కొన్నారు.

దాదాపు 200 ఏళ్ల క్రితం ఒక పురావస్తు శాస్త్రవేత్త గాజు సీసాలో దాచి పెట్టిన సందేశం తాజాగా బయటపడింది. ఫ్రాన్స్‌లోని నార్మాండీ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టిన ఒక వలంటీర్లు బృందానికి ఈ బాటిల్‌ దొరికింది. అత్యవసర తవ్వకాలు చేపడుతుండగా ఈ వారంలోనే సందేశం లభ్యమైందని వారు వెల్లడించారు. కాగా గాజు సీసాలో చుట్టి ఉంచిన ఒక లేఖ ఉంది. నార్మాండీ పట్టణానికి సమీపంలో కొండపై ఉండే ‘గౌలిష్’ అనే గ్రామానికి సంబంధించిన వివరాలు ఆ లేఖలో రాసి ఉన్నాయి.


పలు మేధో సంఘాల్లో సభ్యుడిగా ఉన్న పీజే ఫెరెట్ అనే స్థానిక పురావస్తు శాస్త్రవేత్త జనవరి 1825లో ఇక్కడ తవ్వకాలు చేపట్టినట్టు లేఖలో ఉంది. ‘సిటె లీమ్స్ లేదా సీజర్స్ క్యాంప్’ అని పిలిచే ఈ ప్రాంతంలో ఆయన విస్తృతమైన పరిశోధనలు కొనసాగించినట్టు పేర్కొని ఉంది. లేఖ ద్వారా సందేశం ఇచ్చిన పురావస్తు శాస్త్రవేత్త ఫెరెట్ నాడు స్థానికంగా ప్రముఖు వ్యక్తి అని బీబీసీ కథనం పేర్కొంది. 200 ఏళ్ల క్రితం ఈ ప్రదేశంలో అతడు మొదటిసారి తవ్వకాలు నిర్వహించినట్టు మున్సిపల్ రికార్డులు నిర్ధారిస్తున్నాయని పేర్కొంది.


తవ్వకాలు చేపట్టిన వలంటీర్ల బృందానికి సారధ్యం వహించిన గిల్లామ్ బ్లొండెల్ మాట్లాడుతూ.. మహిళలు వాసన వెదజల్లె లవణాలు కలిగిన ఉన్న చిన్నచిన్న సీసాలను మెడ చుట్టూ ధరించే వారని లేఖలో ఉందని చెప్పారు. సీసాలో సందేశం లభించిన సందర్భం ఒక అద్భుతమైన క్షణమని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఇక్కడ తవ్వకాలు జరిగాయని తమకు తెలుసునని, అయితే 200 ఏళ్ల నుంచి ఈ సందేశం ఇక్కడే ఉండడం, తాము కనుగొనడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని బ్లొండెల్ చెప్పారు. ‘‘సాధారణంగా వడ్రండి పనిచేసేవాళ్లు ఇలాంటి ‘టైమ్ క్యాప్సూల్స్‌’ వదిలిపెడుతుంటారు. కానీ పురావస్తు శాస్త్రంలో ఇలా జరగడం చాలా అరుదు. చాలా మంది పురావస్తు శాస్త్రజ్ఞులు వారి పని పూర్తయ్యాక.. మా తర్వాత ఇంకా ఎవరూ రారులే అని భావిస్తుంటారు!’’ అని బ్లొండెల్ అభిప్రాయపడ్డారు. “ఇది గౌలిష్ గ్రామం అనే విషయం మాకు తెలుసు. ఊరిలో ఏం జరిగిందనేది మనకు తెలియదు. అది ప్రాముఖ్యమైన ప్రదేశమా?” అని ఆయన పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

మనవడి కోసం వినూత్న ట్రెడ్‌మిల్ తయారు చేసిన తాత

ఓరి నాయనో.. రన్నింగ్ ట్రైన్‌లో కూడా పాము

Updated Date - Sep 23 , 2024 | 11:17 AM