Viral Video: అబ్బాయిల బాధను అర్థం చేసుకున్నాడు.. కార్ వెనుక రాసి ఉన్న మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్!
ABN, Publish Date - Apr 25 , 2024 | 01:08 PM
మనదేశంలో చాలా కార్లు, ఆటోలు, లారీల వెనకాల ఏదో ఒక మెసేజ్ రాసి ఉంటుంది. అది ఫన్నీ కొటేషన్ అయినా కావచ్చు, కవిత్వం కావచ్చు, సామాజిక సందేశాలు కావచ్చు.. ఇవి చాలా మందిని ఆకట్టుకుంటాయి. అయితే కొందరు రాసే మెసేజ్‌లు మాత్రం చాలా మందిని ఆలోచింపజేస్తాయి.
మనదేశంలో చాలా కార్లు, ఆటోలు, లారీల వెనకాల ఏదో ఒక మెసేజ్ రాసి ఉంటుంది. అది ఫన్నీ కొటేషన్ అయినా కావచ్చు, కవిత్వం కావచ్చు, సామాజిక సందేశాలు కావచ్చు.. ఇవి చాలా మందిని ఆకట్టుకుంటాయి. అయితే కొందరు రాసే మెసేజ్‌లు మాత్రం చాలా మందిని ఆలోచింపజేస్తాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని క్యాబ్ (Cab) వెనక రాసి ఉన్న మెసేజ్ చాలా మందిని ఆకట్టుకుంటోంది. అది నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
trekkeryatty అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో పోస్ట్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో బిజీ రోడ్డు మీద ఓ క్యాబ్ ఆగి ఉంది. ఆ క్యాబ్ వెనుక రాసి ఉన్న మెసేజ్ కారులో ఉన్న వ్యక్తిని ఆకట్టుకుంది. వెంటనే దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ``2024లో కూతుళ్లు కాదు. నిరుద్యోగ యువకులే తల్లిదండ్రులకు భారం`` అనే మెసేజ్ క్యాబ్ వెనుక రాసి ఉంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 26 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.88 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ``అబ్బాయిల బాధను ఆ వ్యక్తి సరిగ్గా అర్థం చేసుకున్నాడు``, ``బ్రదర్ హృదయపూర్వకంగా రాశాడు``, ``ఆ మెసేజ్ రాసిన వ్యక్తికి హృదయపూర్వక ధన్యవాదాలు``, ``ఇది చేదు వాస్తవం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ పజిల్ మీ సామర్థ్యానికి పరీక్ష.. ఈ ఫొటోలోని మూడు ముఖ్యమైన తేడాలను కనిపెట్టండి!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 25 , 2024 | 04:00 PM