మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Anand Mahindra: వామ్మో.. సర్వీస్ అంటే ఇలా ఉంటుందా? షాకింగ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా!

ABN, Publish Date - May 04 , 2024 | 10:48 AM

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. తన వ్యాపార కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ట్విటర్ ద్వారా ఇతరులతో టచ్‌లో ఉంటారు. తనకు ఆసక్తికరంగా అనిపించిన, ఫన్నీగా అనిపించిన వీడియోలను షేర్ చేస్తూ వాటిపై తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు.

Anand Mahindra: వామ్మో.. సర్వీస్ అంటే ఇలా ఉంటుందా? షాకింగ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా!
Anand Mahindra

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. తన వ్యాపార కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ట్విటర్ ద్వారా ఇతరులతో టచ్‌లో ఉంటారు. తనకు ఆసక్తికరంగా అనిపించిన, ఫన్నీగా అనిపించిన వీడియోలను షేర్ చేస్తూ వాటిపై తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియా చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి అద్దాలతో కూడిన పెద్ద కబోర్డ్‌ను చిన్న స్కూటర్‌పై తీసుకెళ్తున్నాడు. ఆ ఫర్నీచర్‌కు తాడులాంటిదేమీ కట్టకుండా ఓ చేత్తో స్కూటర్ నడుపుతూ, మరో చేత్తో దానిని పట్టుకుని సునాయాసంగా రోడ్డుపై వెళ్లిపోతున్నాడు. ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ``ఫుడ్ కాదు, కిరాణా సామాగ్రి కాదు.. 10 నిమిషాల్లో ఫర్నిచర్ డెలివరీ అంటే ఇలా ఉంటుందా`` అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.


ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 4.7 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ```గొప్ప పనిమంతుడు``, ``మన రోడ్లు, ట్రాఫిక్ ఈ డెలివరీకి అనుమతించవు``, ``ఇది చాలా ప్రమాదకరమైన సూచన``, ``మనసుంటే మార్గం ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: కూతురి బెడ్రూమ్ నుంచి వింత శబ్దాలు.. తల్లిదండ్రులు చెక్ చేస్తే బయటపడిన షాకింగ్ విషయం..!


Puzzle: మీ ఐక్యూను టెస్ట్ చేసుకోండి?.. ఈ ఫొటోలోని తప్పేంటో 5 సెకెన్లలో కనిపెట్టండి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2024 | 10:49 AM

Advertising
Advertising