‘స్మార్ట్’ బాత్‌రూమ్
ABN, Publish Date - Sep 15 , 2024 | 09:58 AM
పాపాయికి చకచకా స్నానం చేయించాలన్నా, సబ్బుతో బట్టలు మెరిపించాలన్నా, టూత్‌బ్రష్‌ని పరిశుభ్రంగా మార్చాలన్నా ఇకపై క్షణాల్లో పనే. వంటింట్లోనే కాదు... బాత్‌రూమ్‌లో కూడా ‘స్మార్ట్’గా పనిచేసే గ్యాడ్జెట్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని...

గ్రిప్‌తో పాటు మసాజ్
చిన్న పిల్లలు, వయసు పైబడినవారు, గర్భిణులు స్నానం చేసేటప్పుడు జారి పడకుండా కాపాడుతుంది ‘బాత్ మ్యాట్’. దీనిపై నిల్చొని కాలును ముందుకు, వెనుకకు కదిపితే చాలు. మ్యాట్‌కు ఉండే మృదువైన బ్రిస్టల్స్ జారిపోకుండా గ్రిప్‌ను అందిస్తూనే, మరోపక్క అరికాళ్లను శుభ్రం చేస్తాయి. ఇది ఒక రకంగా ఫుట్ మసాజర్‌లా పనిచేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పీవీవీ మెటీరియల్‌తో తయారైన ఈ మ్యాట్‌ను పనైపోయాక మడతపెట్టి ఒక మూలన పెట్టేయొచ్చు.
చేతితో తాకకుండానే...
బట్టలు ఉతకడం అనేది పెద్ద పనే అనిపిస్తుంది. సబ్బు రుద్దడం, బ్రష్‌తో శుభ్రం చేయడం శ్రమతో కూడుకున్నదే. అలాంటప్పుడు ‘సోప్ డిస్పెన్సర్ రోలర్’ వాడితే... చేతితో సబ్బు తాకకుండానే చకచకా బట్టలు ఉతికేయొచ్చు. ముందుగా పైనున్న మూత తెరిచి స్ర్పింగ్ బేస్, స్పాంజ్ రోలర్ మధ్యన సబ్బు పెట్టి మూత పెట్టేయాలి. బట్టలు ఉతికేటప్పుడు సబ్బు రోలర్‌కి తగిలి నురుగు రావడం మొదలవుతుంది. దీనివల్ల సబ్బు చేతి నుంచి జారుతుందనే చికాకు ఉండదు. ఇంట్లో అమ్మలు, అమ్మమ్మలకు దీన్ని బహుమతిగా ఇవ్వొచ్చు.
టూత్‌బ్రష్ పరిశుభ్రతకు...
చాలామంది టూత్ బ్రష్‌లను బాత్‌రూంలో అలాగే ఉంచేస్తారు. దీనివల్ల అక్కడున్న బ్యాక్టీరియా, ఫంగస్ బ్రష్‌లపై చేరి... నోటి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమస్యకు చెక్ పెడుతుంది ‘టూత్ బ్రష్ హోల్డర్’. ఇందులో ఉండే యూవీ కిరణాలు బ్రష్ మీద పేరుకుపోయిన బ్యాక్టీరియాను నాశనం చేసి, పరిశుభ్రంగా మారుస్తాయి. ప్రతీ స్టెరిలైజేషన్‌కు సమారు 6 నిమిషాల సమయం పడుతుంది. బటన్ నొక్కితే డిస్‌ప్లేపై టైమర్ మొదలై స్టెరిలైజేషన్ పూర్తయ్యాక ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఇది యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తుంది.
పాపాయి పడిపోకుండా...
నెలల పిల్లల్ని ఎత్తుకోవడమే కష్టమనుకుంటే, ఇక వారికి స్నానం చేయించడం తల్లులకు పెద్ద సవాలే. ఈ సమస్యను తీర్చేందుకు ‘బేబీ బాత్ షవర్’లు ప్రస్తుతం అందుబాటులోకొచ్చాయి. దీనిపై పాపాయిని నిల్చోబెట్టి కావాల్సిన సైజులో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీని సాయంతో పిల్లలకు డైపర్లు, డ్రాయర్లు, ప్యాంట్లు కూడా సులువుగా మార్చొచ్చు. స్నానం చేయించేటప్పుడు షవర్ హెడ్‌ని తగిలించడానికి వీలుగా ముందు ఒక హోల్డర్ కూడా ఉంటుంది. ఆరు నుంచి పద్దెనిమిది నెలల వయసు గల పిల్లలకు ఇది సరిగ్గా సరిపోతుంది.
లాండ్రీ బ్యాగ్
వాడేసిన బట్టలకు ‘ఫోల్డబుల్ లాండ్రీ బ్యాగ్’ చక్కగా పనికొస్తుంది. దీనిని గోడకు లేదా వాషింగ్ మెషీన్‌కు ఒక వైపున తగిలించొచ్చు. లేదంటే మడతపెట్టి ఒక మూలన పెట్టేస్తే సరి. వీటిని బొమ్మలు, పుస్తకాలు, గృహోపకరణాలు పెట్టుకు నేందుకు కూడా ఉపయోగించు కోవచ్చు. వివిధ రకాల డిజైన్లు, రంగుల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
పాపాయి పడిపోకుండా...
నెలల పిల్లల్ని ఎత్తుకోవడమే కష్టమనుకుంటే, ఇక వారికి స్నానం చేయించడం తల్లులకు పెద్ద సవాలే. ఈ సమస్యను తీర్చేందుకు ‘బేబీ బాత్ షవర్’లు ప్రస్తుతం అందుబాటులోకొచ్చాయి. దీనిపై పాపాయిని నిల్చోబెట్టి కావాల్సిన సైజులో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీని సాయంతో పిల్లలకు డైపర్లు, డ్రాయర్లు, ప్యాంట్లు కూడా సులువుగా మార్చొచ్చు. స్నానం చేయించేటప్పుడు షవర్ హెడ్‌ని తగిలించడానికి వీలుగా ముందు ఒక హోల్డర్ కూడా ఉంటుంది. ఆరు నుంచి పద్దెనిమిది నెలల వయసు గల పిల్లలకు ఇది సరిగ్గా సరిపోతుంది.
Updated Date - Sep 15 , 2024 | 10:00 AM