ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ఎంత పని చేశావ్ రా బుడ్డోడా.. ఇంటికి పోతే అమ్మ చేతిలో బడిత పూజే ఇక...

ABN, Publish Date - Jan 08 , 2024 | 10:37 AM

బాల్యం అందరికీ అందమైనదే కాదండోయ్.. మరిచిపోని జ్ఞాపకం కూడా. చిన్నతనంలో చేసే చిలిపి పనులు జీవితాంతం

బాల్యం అందరికీ అందమైనదే కాదండోయ్.. మరిచిపోని జ్ఞాపకం కూడా. చిన్నతనంలో చేసే చిలిపి పనులు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అమ్మానాన్నలు చేయకూడదని చెప్పిన పనినే చేస్తూ.. ఎన్ని సార్లు దెబ్బలు తిన్నామో గుర్తే లేదు. పెద్దయ్యాక ఆ చిన్ననాటి సంగతులు గుర్తుకు వస్తుంటాయి.సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయిన తర్వాత.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ అందులోనే మునిగి తేలుతున్నారు. సమయంతో సంబంధం లేకుండా గంటలకు గంటలు గడిపేస్తున్నారు. తాజాగా.. సోషల్ మీడియాలో నవనీత్ సికేరా అనే ఐపీఎస్ అధికారి షేర్ చేసిన వీడియో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. ఇంతకీ అందులో ఏముందో.. ఇప్పుడు తెలుసుకుందాం రండి.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్నారి బట్టలు బురదమయంగా మారాయి. అతని వాలకం చూస్తే బురద గుంటలో స్నానం చేసినట్లు అర్థమవుతోంది. అంతే కాకుండా ఆ చిన్నారి ఒక చేతితో ప్యాంటు, మరొక చేతితో చెప్పులు పట్టుకుని వెళ్లడాన్ని మనం చూడవచ్చు. ఈ వీడియో ఐపీఎస్ ఆఫీసర్ నవనీత్ సికెరాను ఎంతగానో ఆకర్షించింది. ఎక్స్ లో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ మీ చిన్నతనంలో మీరు ఇలాంటి పరిస్థితులను ఎన్ని సార్లు ఎదుర్కొన్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత మీకు ఏ ఆయుధంతో స్వాగతం పలికారని ఫన్నీ క్యాప్షన్ ఇచ్చారు.


కేవలం 8 సెకన్లు నిడివి ఉన్న ఈ ఫన్నీ వీడియోను ఇప్పటివరకు 21 వేలకు పైగా వీక్షించారు. వందలాది మంది లైక్ చేశారు. వీడియో చూసిన తర్వాత తమ అభిప్రాయాలను వివిధ రకాలుగా కామెంట్ల రూపంలో రాస్తున్నారు. ఇలాంటి పని చేసినప్పుడు.. చీపురు పట్టి స్వాగతం పలికారని కామెంట్ చేశాడు ఓ నెటిజన్.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 08 , 2024 | 10:37 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising