ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: నీకు నేను.. నాకు నువ్వు.. ఈ వృద్ధ దంపతుల ప్రేమకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..

ABN, Publish Date - Jan 07 , 2024 | 11:00 AM

పెళ్లంటే నూరేళ్ల పంట.. ఈ మాట ఊరికే చెప్పలేదండోయ్.. ఎంతో మంది అనుభవజ్ఞులు ఎన్నో రకాల అనుభవాలను

పెళ్లంటే నూరేళ్ల పంట.. ఈ మాట ఊరికే చెప్పలేదండోయ్.. ఎంతో మంది అనుభవజ్ఞులు ఎన్నో రకాల అనుభవాలను ఎదుర్కొని చెప్పిన అక్షర సత్యం ఇది. మూడుముళ్ల బంధంతో ఒక్కటై.. చివరి వరకూ కలిసుంటానని చేసే పెళ్లినాటి ప్రమాణాలకు సాక్షాత్కారంగా నిలుస్తోంది ఈ వీడియో. కష్టసుఖాల్లోనూ తోడుంటానని, పట్టుకున్న చేయిని విడిచిపెట్టేది లేదంటూ ఓ భర్త.. తన భార్యపై ప్రేమను పంచుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూడు ముళ్లంటే మున్నాళ్ల ముచ్చటగా మారిన ప్రస్తుత జెనరేషన్ కు ఈ పాత తరం దంపతులు ఓ రోల్ మోడల్ గా నిలుస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. ఎన్నో కష్టసుఖాలను తట్టుకుని నిలబడి చివరి పడి వరకు అవగాహనతో పయనిస్తున్న ఈ దంపతుల వీడియో.. నెట్టింట తెగ చక్కర్లుకొడుతోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వృద్ధుడు.. తన భార్య తల వెంట్రుకలను దువ్వెనతో దువ్వడాన్ని చూడవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయిన ఈ వీడియో.. వృద్ధ దంపుతుల మధ్య ఉన్న అనుబంధాన్ని చూపిస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు తమ స్నేహితులకు, బంధువులకు షేర్ చేస్తున్నారు. నిజమైన ప్రేమ అనేది సమయం, పరిస్థితులకు సంబంధం లేనిదని, దగ్గరున్నా దూరంగా ఉన్నా.. ఇద్దరూ ఒకటే అనే భావన కలిగి ఉండేదని పలువురు నెటిజన్లు కామెంట్ల రూపంలో రాస్తున్నారు. ఈ క్లిప్ కు ఇప్పటి వరకు 10 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం.

Updated Date - Jan 07 , 2024 | 11:04 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising