Old is Gold: వారెవ్వా.. ఈ అమ్మమ్మ చెవిపోగులు ముందు ఫ్యాషన్ కమ్మలు కూడా పనికిరావు..
ABN, Publish Date - Nov 29 , 2024 | 07:47 PM
ఆడవాళ్లకు జ్యువెలరీ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కాలంలో అయితే అమ్మాయిల జ్యువెలరీలు చాలా ఫ్యాషన్‌గా ఉంటున్నాయి. అయితే, ఈ అమ్మమ్మ చెవిపోగులు ముందు ఎంత ఫ్యాషన్ కమ్మలైనా తక్కువేనని అనిపిస్తుంది.
Old is Gold: ఆడవాళ్లకు జ్యువెలరీ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి శుభకార్యానికైనా మ్యాచింగ్ జాకెట్ నుంచి గాజుల వరకు ఎక్కడా రాజీపడరు. సందర్భానికి తగిన ఆభరణాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. కొంతమంది భార్యలు భర్తలతో గొడవ పడి మరి కొనిపించుకుంటారు. అయితే, ఈ మధ్య కాలంలో జ్యువెలరీలు మరింత ఫ్యాషన్ గా కనిపిస్తున్నాయి. రింగ్స్, చెవి కమ్మలు, నెక్ పీస్, బ్యాంగిల్స్, వంటివి మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి.
ఆ కాలంలోనే..
మీరు గమనించినట్లైతే, యువతులు, మహిళలు ధరిస్తున్న లేటెస్ట్ ఆభరణాలు పాత రోజుల నుంచే మనం చూస్తున్నాం. అమ్మాయిలు ఈ మధ్య కాలంలో చెవి చుట్టు మొత్తం కుట్టించుకుని అందుకు తగినట్టుగా కమ్మలు పెట్టుకుని ఫ్యాషన్ గా కనిపిస్తున్నారు. అయితే, మన పెద్దలు ఆ కాలంలోనే చెవి చుట్టు కమ్మలు కుట్టించుకుని మొత్తం బంగారు ఆభరణాలతో కనిపించేవారు. ముఖ్యంగా పల్లెటూరులోని మహిళలు, వృద్ధలు ఏదైనా పండుగా వచ్చిందంటే ఇంట్లో ఉన్న నగలన్నీ.. అందంగా ఒంటికి అలంకరించుకునే వారు.
అయితే, అప్పటి బంగారు ఆభరణాల ముందు ఇప్పుటి ఫ్యాషన్ చెవిపోగులు ఏ మాత్రం తక్కువ కాదని నవ్య శ్రీ అనే మహిళ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఆ వీడియోలో ఓ అమ్మమ్మ తన చెవి మొత్తాన్ని బంగారు ఆభరణాలతో అలకరించుకుంది. అమ్మమ్మ ధరించిన బంగారు చెవిపోగులు చూస్తే ఇప్పుటి ఫ్యాషన్ కన్నా అవే చాలా అందంగా అనిపిస్తున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. వారెవ్వా అమ్మమ్మ.. బంగారు ఆభరణాలు మాములుగా లేవుగా.. ఎంతైనా పాత బంగారం పాత బంగారమే అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఆరోగ్య ప్రయోజనాలు..
ఆడవారు చెవులు కుట్టించడం అనేది ఎన్నో దశబ్దాలుగా వస్తున్న ప్రక్రియ. చెవి కమ్మలు ధరించడం అనేది కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఋతు క్రమం నిర్వహించడానికి ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. చెవులు కుట్టించడం వల్ల మనలోని భయం, ఆందోళన, ఒత్తిడి వంటి అనేక సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా, మెదడుకు రక్త ప్రసరణ మెరుగ్గా జరుగడంతోపాటు మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది.
Updated Date - Nov 29 , 2024 | 08:01 PM