AC Helmet: ట్రాఫిక్ పోలీసుల సమ్మర్ కష్టాలకు చెక్.. భలేగా ఏసీ హెల్మెట్.. విశేషాలివే
ABN, Publish Date - Apr 18 , 2024 | 03:42 PM
అసలే వేసవి కాలం.. ఆపై ట్రాఫిక్ పోలీసులు. ఎండలో పని. వారి కష్టం మామూలుగా ఉండదు. భానుడి భగభగల మధ్య విధులు నిర్వహించాలి. ఎండ వేడిని తట్టుకునేలా సంరక్షణ చర్యలు తీసుకోవాలి. ఇంతటి కష్టం అనుభవించే ట్రాఫిక్ పోలీసుల బాధను అర్థం చేసుకుని గుజరాత్‌లోని వడోదర పోలీసులు పరిష్కారం కనుగొన్నారు. తమ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్(AC Helmet)లను అందిస్తున్నారు.
గాంధీనగర్: అసలే వేసవి కాలం.. ఆపై ట్రాఫిక్ పోలీసులు. ఎండలో పని. వారి కష్టం మామూలుగా ఉండదు. భానుడి భగభగల మధ్య విధులు నిర్వహించాలి. ఎండ వేడిని తట్టుకునేలా సంరక్షణ చర్యలు తీసుకోవాలి. ఇంతటి కష్టం అనుభవించే ట్రాఫిక్ పోలీసుల బాధను అర్థం చేసుకుని గుజరాత్‌లోని వడోదర పోలీసులు పరిష్కారం కనుగొన్నారు.
తమ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్(AC Helmet)లను అందిస్తున్నారు. ఈ హెల్మెట్లు 40-42 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చల్లదనాన్ని అందిస్తాయి. ఇవి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంటాయి. సూర్యకాంతి నుంచి కళ్లను రక్షించడానికి వీజర్, ఛార్జింగ్ పాయింట్ ఉంటాయి. హెల్మెట్‌ని పూర్తిగా ఛార్జ్ చేస్తే 8 గంటల వరకు కూలింగ్‌ని అందించగలవు.
వడదెబ్బ కారణంగా చాలా మంది అధికారులు ఈ మధ్య కాలంలో రోడ్డుపై స్పృహ కోల్పోయి పడిపోయారు. దీంతో ఎండ బారి నుంచి తప్పించుకోవడానికి పోలీసులు వినూత్న ఐడియాకి శ్రీకారం చుట్టారు. హెల్మెట్ ప్రయోగం విజయవంతం అయింది. దీని సాయంతో ట్రాఫిక్ పోలీసులు తమ విధులను సౌకర్యవంతంగా నిర్వహించారు.
పోలీసుల ఐడియాను ప్రజలు అభినందిస్తున్నారు. ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వడోదర పోలీసుల ఆలోచన చాలా మంచిదని.. ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా ఏసీ హెల్మెట్ల విషయంలో చొరవ తీసుకోవాలని ఓ నెటిజన్ సూచించాడు.
Uttar Pradesh: యూపీ ఎన్నికల్లో తెలంగాణ ఆడబిడ్డ పోటీ..
కాన్పుర్‌లో కూడా..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పుర్‌లో కూడా ట్రాఫిక్ పోలీసుల కోసం అధికారులు ఏసీ హెల్మెట్లను అందించారు. ట్రాఫిక్ డీసీపీ ఆర్తీ సింగ్ మాట్లాడుతూ.. నగరంలోని ఆరు ప్రధాన కూడళ్లలో పని చేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు హెల్మెట్లను అందించినట్లు చెప్పారు. ఏసీ హెల్మెట్లు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. వీటిని నగరంలోని ఇతర కూడళ్లలో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు కూడా అందిస్తామన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 18 , 2024 | 03:43 PM