ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AC Tips: ఏసి ఎంతసేపు వాడినా తక్కువ కరెంట్ బిల్ రావాలంటే.. ఈ సింపుల్ టిప్స్ పాటించాల్సిందే..!

ABN, Publish Date - Apr 16 , 2024 | 03:54 PM

ఇప్పట్లో మధ్య తరగతి కుటుంబాలు కూడా ఆర్థికభారం అయినా సరే ఏసి లు వినియోగిస్తున్నాయి. అయితే ఏసి పెట్టించుకోవడం ఒక ఎత్తు అయితే దానికి నెల నెలా వచ్చే విద్యుత్ బిల్లు చెల్లించడం మరొక ఎత్తు. కానీ ఏసి ఎంతసేపు వాడినా విద్యుత్ బిల్లు తక్కువ రావాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి

ఇప్పటి వేసవి ఎండలకు, ఉక్కపోతకు సాధారణ ఫ్యాన్ లు సరిపోవడంలేదు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో ఉక్కపోతకు సర్థుకుపోవడం అనే మాటే ఉండదు. ఈ కారణంగా చాలావరకు మధ్య తరగతి కుటుంబాలు కూడా ఆర్థికభారం అయినా సరే ఏసి లు పెట్టించుకుంటున్నారు. అయితే ఏసి పెట్టించుకోవడం ఒక ఎత్తు అయితే దానికి నెల నెలా వచ్చే విద్యుత్ బిల్లు చెల్లించడం మరొక ఎత్తు. కానీ ఏసి ఎంతసేపు వాడినా విద్యుత్ బిల్లు తక్కువ రావాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి. అవ్వేంటో తెలుసుకుంటే..

ఉష్ణోగ్రత..

ఎయిర్ కండీషనర్ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే గది మరింత చల్లగా ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ పూర్తీ కరెక్ట్ కాదు. ఏసి సగటు ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్. ఈ ఉష్ణోగ్రత మనిషి శరీరానికి సరైనది. సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఎయిర్ కండీషనర్‌లో పెరిగిన ప్రతి డిగ్రీ ఉష్ణోగ్రత దాదాపు 6 శాతం విద్యుత్ ను ఆదా చేస్తుంది. ఏసి ఎంత వాడినా విద్యుత్ బిల్ తక్కువ రావాలి అంటే ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్కు బదులుగా 24 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచాలి.

అధిక రక్తపోటు తొందరగా తగ్గడానికి ఆయుర్వేదం చెప్పిన చిట్కాలివీ..!


స్టార్ రేటింగ్..

5-స్టార్ రేటింగ్ ఉన్న ఎయిర్ కండీషనర్ గదిని అత్యంత సమర్థవంతంగా చల్లబరుస్తుంది. అంతే కాదు విద్యుత్ వినియోగాన్ని కూడా తగ్గిస్తుంది.

టైమర్..

ఎయిర్ కండీషనర్‌లో టైమర్ ఫీచర్ ఉంటే దాన్ని సర్థవంతంగా వినియోగించుకోవాలి. ఎయిర్ కండీషనర్‌ను టైమర్‌తో ఆన్/ఆఫ్ చేయడానికి షెడ్యూల్ చేయవచ్చు. ఈ ఫీచర్ నిద్రలో ఆటోమేటిక్‌గా ఎయిర్ కండీషనర్‌ని ఆన్ లేదా ఆఫ్ చేయడమే కాకుండా సాధారణ వినియోగంతో పోలిస్తే విద్యుత్‌ను ఆదా చేస్తుంది. ఈ ఫీచర్‌ని అలవాటు చేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో బిల్లులు తక్కువగా ఉంటాయి.

రోజూ బొడ్డులో కొన్ని చుక్కల నూనె వేస్తే శరీరంలో కలిగే మార్పులేంటో తెలుసా?


సంరక్షణ..

ఏసి వాడేటప్పుడు సంరక్షణ కూడా చాలా ముఖ్యం. 'డోర్ క్లోజ్డ్ పాలసీ'ని అనుసరిస్తే విద్యుత్ వినియోగం తగ్గుతుంది. తలుపులు, కిటికీలను మూసివేసి వాటిని కర్టెన్లతో కప్పి ఉంచాలి. ఇలా చేయడం వల్ల గది చల్లదనం తగ్గదు. కండీషనర్ కూడా త్వరగా, ఎఫెక్టివ్‌గా గదిని చల్లబరుస్తుంది. ఎయిర్ కండీషనర్ మెషీన్‌పై అనవసరమైన భారం ఉండదు. దీంతో ఏసి తక్కువ సమయం పనిచేయడంతో పాటు కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది. ఏసిని జాగ్రత్తగా వాడితే అది ఫిట్‌గా కూడా ఉంటుంది. ఎక్కువకాలం మన్నిక వస్తుంది.

రాగులను రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకుంటే జరిగేదిదే..!

ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే.. ఏం జరుగుతుందంటే..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 16 , 2024 | 03:54 PM

Advertising
Advertising