ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: తనను కిడ్నాప్ చేసిన వారికి శిక్ష పడేలా చేసిన యువకుడు.. అదీ 17 ఏళ్ల తర్వాత.. ఎలాగంటే..?

ABN, Publish Date - Sep 23 , 2024 | 12:03 PM

చిన్నప్పుడు కిడ్నాపునకు గురయ్యాడు. పెరిగి.. పెద్దయిన తర్వాత లాయర్‌గా మారి తన కిడ్నాప్ కేసును తానే వాదించుకున్నాడు. ఈ కిడ్నాప్ కేసులో నిందితులకు యావజ్జీవ ఖైదు శిక్ష పడేలా చేశాడు. ఓ బాధితుడే.. తన కేసును వాదించుకుని నిందితులకు శిక్షపడేలా చేశాడు.

చిన్నప్పుడు కిడ్నాపునకు గురయ్యాడు. పెరిగి.. పెద్దయిన తర్వాత లాయర్‌గా మారి తన కిడ్నాప్ కేసును తానే వాదించుకున్నాడు. ఈ కిడ్నాప్ కేసులో నిందితులకు యావజ్జీవ ఖైదు శిక్ష పడేలా చేశాడు. ఓ బాధితుడే.. తన కేసును వాదించుకుని నిందితులకు శిక్షపడేలా చేశాడు. ఈ న్యూస్ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటు చేసుకుంది.


ఇంతకీ ఏం జరిగిందంటే..?

2007లో హర్ష తన తండ్రితో కలిసి మెడికల్ షాప్ వద్ద కూర్చున్నాడు. అ సమయంలో రాజస్థాన్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారు షాపు వద్దకు వచ్చి ఆగింది. కారు నుంచి దిగిన వ్యక్తులు హర్షని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో అతడి తండ్రి రవి గార్గ్ బిగ్గరగా అరవబోయాడు. దీంతో రవి గార్గ్‌పై దుండగులు కాల్పులు జరపడంతో.. ఆయన తీవ్రంగా గాయపడ్డారు.

Also Read: Bhagwant Mann: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం


అంతలో హర్ష గార్గ్‌ను దుండగులు కిడ్నాప్ చేసి తమ కారులో తరలించారు. హర్ష గార్గ్ క్షేమంగా ఇంటికి చేరాలంటే రూ.55 లక్షలు చెల్లించాలంటూ అతడి తండ్రి రవి గార్గ్‌ను ఫోన్‌లో బెదిరించారు. దీంతో రవి గార్గ్ స్థానిక కేహర్‌గడ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ అయిన దాదాపు నెల రోజులకు హర్ష గార్గ్ కిడ్నాపర్ల చెర నుంచి ఎలాగోలా తప్పించుకుని క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. అనంతరం ఈ కేసు దర్యాప్తులో భాగంగా హర్షని కిడ్నాప్ చేసిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: Hyderabad: పలు ప్రాంతాల్లో నేడు మంచి నీటి సరఫరా బంద్


2014 నుంచి ప్రత్యేక న్యాయస్థానంలో ఈ కేసుకు సంబంధించి వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ కేసులో హర్ష తరఫున అతడి తండ్రి రవి గార్గ్ వాదించే వారు. ఆ సమయంలో హార్ష కోర్టుకు హాజరయ్యే వాడు. ఈ సందర్భంగా తాను సైతం న్యాయవాది కావాలని అప్పుడే హర్ష నిర్ణయించుకున్నాడు. దీంతో డిగ్రీ పూర్తి చేసి.. అనంతరం ఆగ్రాలోని లా కాలేజీలో చేరాడు. అలా 2022లో ఎల్ ఎల్ బీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఏడాది బార్ కౌన్సిల్‌లో సైతం తన పేరును హర్ష నమోదు చేసుకున్నాడు. ఇక తన కిడ్నాప్ కేసుకు సంబంధించి కోర్టులో జరిగిన వాదోపవాదాల్లో సైతం అతడు పాల్గొని.. తన కేసును తానే వాదించుకున్నాడు.

Also Read: Narendra Modi: యూఎస్‌లో మరో రెండు భారతీయ రాయబార కార్యాలయాలు ఏర్పాటు


అలా ఈ కేసులో వాదోపవాదాలు ఈ ఏడాది జూన్‌లో ముగిశాయి. సెప్టెంబర్ 17వ తేదీన ఈ కిడ్నాప్‌ కేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తుది తీర్పును వెలువరించారు. ఈ కిడ్నాప్ కేసులో మొత్తం 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఎనిమిది మందికి మాత్రమే యావజ్జీవ కారాగార శిక్షను ప్రత్యేక న్యాయ స్థానం విధించింది.


మిగిలిన నలుగురికి సాక్ష్యాధారాలు లేక పోవడంతో వారిని నిర్థోషులుగా న్యాయస్థానం విడుదల చేసింది. ఇక ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు ఇప్పటికే చనిపోయారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా హర్షకు వారంతా హాట్సాఫ్ చెబుతున్నారు.

మరిన్ని ప్రత్యేకమైన వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 23 , 2024 | 12:08 PM