Viral News: సమాధిని తవ్విన కుక్కలు.. లేచి కూర్చున్న శవం
ABN, Publish Date - Aug 02 , 2024 | 05:26 PM
సమాజంలో అప్పుడప్పుడూ జరిగే కొన్ని ఘటనలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి. చనిపోయారనుకున్న వ్యక్తిని స్మశానికి తీసుకెళ్తే లేచి కూర్చున్న ఘటనలను నిత్య జీవితంలో ఎన్నో చూశాం. అచ్చం ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.
ఆగ్రా: సమాజంలో అప్పుడప్పుడూ జరిగే కొన్ని ఘటనలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి. చనిపోయారనుకున్న వ్యక్తిని స్మశానికి తీసుకెళ్తే లేచి కూర్చున్న ఘటనలను నిత్య జీవితంలో ఎన్నో చూశాం. అచ్చం ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. చనిపోయాడనుకుని భావించిన వ్యక్తిని పూడ్చిపెట్టగా.. అతడు స్పృహలోకి రావడం తీవ్ర భయాందోళనలకు గురి చేసింది.
బాధితుడు యూపీలోని ఆగ్రాకు చెందిన 24 ఏళ్ల రూప్ కిశోర్‌గా పోలీసులు గుర్తించారు. అతనిపై దాడి చేసి చనిపోయాడనుకుని పూడ్చిపెట్టినట్లు వారు చెప్పారు. అసలేమైందంటే.. జులై 18న ఆగ్రాలోని అర్టోని ప్రాంతంలో అంకిత్, గౌరవ్, కరణ్, ఆకాష్ అనే నలుగురు వ్యక్తులు రూప్ కిశోర్‌పై దాడి చేశారు.
భూవివాదం కారణంగా వారంతా తనపై కత్తులతో దాడి చేసి గొంతు కోశారని బాధితుడు తెలిపాడు. దాడి అనంతరం తాను చనిపోయాడనుకుని భావించి తమ పొలంలో పాతిపెట్టారని చెప్పాడు.
తవ్విన జాగీలాలు..
అయితే అతన్ని పాతిపెట్టిన ప్రదేశాన్ని వీధి కుక్కలు తవ్వడం ప్రారంభించాయి. అలా తవ్వుతూ.. రూప్ కిశోర్ శరీరాన్ని కొరికాయి. దీంతో రూప్ కిశోర్ అకస్మాత్తుగా స్పృహలోకి వచ్చాడు. అతన్ని స్థానికులు గుర్తించారు. జరిగిన విషయాన్ని రూప్ కిశోర్ స్థానికులకు చెప్పాడు. అతడ్ని చూసి స్థానికులు ఒకింత భయాందోళనకు గురయ్యారు. అనంతరం వారంతా బాధితుడిని చికిత్సనిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కేసు నమోదు..
తన కొడుకును నలుగురు దుండగులు ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లారని రూప్ కిషోర్ తల్లి ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నారని.. వారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
For Latest News and National News Click Here
Updated Date - Aug 02 , 2024 | 05:58 PM