ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఊడిన విమానం కిటికీ..తర్వాత ఏమైందంటే

ABN, Publish Date - Jan 06 , 2024 | 12:29 PM

ఓ విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు కూర్చున్న సీటు పక్కన విండో ఆకస్మాత్తుగా ఊడిపోయింది. దీంతో ఫ్లైట్‌లోకి పెద్ద ఎత్తున గాలి దూసుకొచ్చింది.

ఓ విమానం(flight) గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు కూర్చున్న సీటు పక్కన విండో ఆకస్మాత్తుగా ఊడిపోయింది. దీంతో ఫ్లైట్‌లోకి పెద్ద ఎత్తున గాలి దూసుకొచ్చింది. ఆ క్రమంలో అక్కడున్న ప్రయాణికులతోపాటు మరికొంత మంది కూడా ఇబ్బందికి గురయ్యారు. ఆ తర్వాత గమనించి అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని ఆకస్మాత్తుగా ల్యాండ్ చేశారు. అయితే విమానం గాలిలోకి ఎగిరిన సమయంలో మొత్తం అందులో 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Elections: రెండు దశాబ్దాలు.. 60 దేశాలు.. ఎలక్షన్ మూడ్‌లోకి ప్రపంచం


ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది. వీడియోలో విమానం కిటికీ ఉడినట్లు కనిపిస్తుండగా..గాలి ఒత్తిడిని ప్రయాణికులు ఎదుర్కొన్నట్లు కనిపిస్తోంది. 16,300 అడుగుల ఎత్తులో ఎగిరిన ఫ్లైట్‌లో గాలి తాకిడికి ఓ చిన్నారి చొక్కా చిరిగిపోయినట్లుగా వీడియోలో కనిపించింది. అలాస్కా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1282 బోయింగ్ 737-9 MAX విమానం ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్ నుంచి కాలిఫోర్నియాలోని అంటారియోకి బయలుదేరిన క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నామని ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. మరోవైపు ఎవరైనా గాయపడ్డారా అనే విషయం తెలియాల్సి ఉంది.

Updated Date - Jan 06 , 2024 | 12:29 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising