ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: దాండియా, గార్బా ఆడిన అంబానీ కుటుంబం.. వైరల్ వీడియో

ABN, Publish Date - Oct 07 , 2024 | 05:10 PM

నవరాత్రి వేడుకల్లో భాగంగా అంబానీ కుటుంబం కూడా గార్బా నృత్యం చేసి ఆకట్టుకుంది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఉత్సవాల సందర్భంగా అంబానీ కుటుంబం గర్బాను ప్రదర్శిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: నవరాత్రి.. ఉల్లాసభరితమైన రంగుల పండుగ. దేశప్రజలంతా ఉత్సాహంతో తొమ్మిది రోజులపాటు జరుపుకునే వేడుక. నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజిస్తారు. అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు చేయడంతోపాటు వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా సంబరాలను జరుపుకుంటారు. నవరాత్రులలో అత్యంత ప్రజాదరణ పొందిన వేడుకలలో ఒకటి గార్బా. లయబద్ధమైన చప్పట్లు, దాండియా కర్రలతో చేసే సంప్రదాయ నృత్యం ఇది. ఉత్తరాది రాష్ట్రాల్లో గార్బా డ్యాన్స్ ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకుంది. కాగా.. నవరాత్రి వేడుకల్లో భాగంగా అంబానీ కుటుంబం కూడా గార్బా నృత్యం చేసి ఆకట్టుకుంది.

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఉత్సవాల సందర్భంగా అంబానీ కుటుంబం గర్బాను ప్రదర్శిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 2024 జులైలో అనంత్ అమ్మమ్మ కోకిలాబెన్ అంబానీ నిర్వహించిన గ్రాండ్ దాండియా సమయంలో తీసిన మరో వీడియో కూడా ట్రెండ్ అవుతోంది. వీడియోలో నీతా అంబానీ, ముఖేష్ అంబానీ, వారి పెద్ద కోడలు శ్లోకా మెహతా అంబానీ, ఇతర బంధువులు గర్బా, దాండియా ఆడటం వీడియోలో చూడవచ్చు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమం సంస్కృతి సంప్రదాయాలతో కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని, పండుగలను ఘనంగా జరుపుకోవాలనే వారి అభిరుచిని తెలియజేస్తోంది.


నీతా అంబానీ గురించి..

వ్యాపారవేత్త నీతా అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ భార్య. ఆమె రవీంద్రభాయ్, పూర్ణిమా దలాల్ దంపతుల కుమార్తె. ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ... ముఖేష్, నీతా దంపతుల సంతానం.

ఘనంగా వేడుకలు..

దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గామాత మండపాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ.. చాలా చోట్ల అన్నదానాలు నిర్వహిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలందుకున్న అమ్మవారిని 9 రోజుల తరువాత నిమజ్జనం చేస్తారు.

ఇవి కూడా చదవండి...

KTR: మూసీ ఆర్భాటం ఎవరి కోసం.. కేటీఆర్ సూటి ప్రశ్న

Viral: భారతీయులకే జాబ్స్ ఇస్తున్నారు.. కెనడా శ్వేతజాతీయురాలి సంచలన ఆరోపణ

Bathukamma: ఆరోరోజు అలిగిన బతుకమ్మ... ఎందుకు అలిగిందో తెలుసా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 07 , 2024 | 05:11 PM