ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇండియా టూర్‌కి వచ్చి ఇక్కడే ఉండిపోయింది.. ఈమె మాటలు వింటే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగాల్సిందే..

ABN, Publish Date - Sep 28 , 2024 | 01:19 PM

దాదాపు 140 కోట్ల జనాభా ఉన్నా శాంతి భద్రతలకు నెలవైన దేశం భారతదేశం. ఎన్నో మతాల ప్రజలు కలిసి మెలిసి శాంతియుతంగా జీవిస్తున్న దేశం భారతదేశం. ప్రతి సంవత్సరం ఎన్నో వేల మంది భారతదేశాన్ని చూడడానికి వస్తుంటారు. అలాగే అమెరికాకు చెందిన క్రిస్టెన్ ఫిషర్ అనే మహిళ కూడా ఇండియాకు వచ్చింది.

woman left America and settled in India,

దాదాపు 140 కోట్ల జనాభా ఉన్నా శాంతి భద్రతలకు నెలవైన దేశం భారతదేశం (India). ఎన్నో మతాల ప్రజలు కలిసి మెలిసి శాంతియుతంగా జీవిస్తున్న దేశం భారతదేశం. ప్రతి సంవత్సరం ఎన్నో వేల మంది భారతదేశాన్ని చూడడానికి వస్తుంటారు. అలాగే అమెరికా (America)కు చెందిన క్రిస్టెన్ ఫిషర్ (Kristen Fisher) అనే మహిళ కూడా ఇండియాకు వచ్చింది. కానీ, ఆమె తిరిగి అమెరికాకు వెళ్లలేదు. తన భర్త, ముగ్గురు పిల్లలతో సహా భారత్‌లోనే స్థిరపడిపోయింది. భూతల స్వర్గంగా భావించే అమెరికాను వదిలి ఆమె ఇక్కడ స్థిరపడడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఇండియాలో స్థిరపడాలనుకున్న తన నిర్ణయం వెనుకున్న కారణాన్ని ఆమె తాజాగా వివరించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


``అమెరికాను వదిలి భారత్‌లోనే ఎందుకు స్థిరపడ్డారనే ప్రశ్న నాకు పదే పదే ఎదురవుతుంది. ఎంతో సౌకర్యవంతంగా ఉండే అమెరికాను వదిలి వచ్చిన నాకు పిచ్చి అని చాలా మంది అన్నారు. భారత్‌ కంటే అమెరికా జీవితం గొప్పదని మీరు అనుకుంటే, మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని నేను అనుకుంటాను. అమెరికాలో ప్రజలు తమ సొంత ప్రపంచంలో జీవిస్తుంటారు. ప్రజల మధ్య సామాజిక అనుబంధం ఉండదు. భారతీయులు సంస్కృతి, జీవితం చాలా అద్భుతమైనది. ఇది డబ్బు కంటే విలువైనద``ని క్రిస్టెన్ పేర్కొంది.


అమెరికాలో ఇప్పటివరకు తాను జీవించలేకపోయిన జీవితాన్ని తక్కువ సమయంలోనే భారత్‌లో గడిపానని క్రిస్టెన్ చెప్పింది. భారత్ లాంటి దేశం ఎక్కడా లేదని ఆమె ప్రశంసించింది. ఇక్కడి ప్రజలు కలిసి మెలిసి జీవనం సాగిస్తారని, ఒక సమాజంగా ఉంటారని పేర్కొంది. భారత్‌లో ఎవరూ ఒంటరిగా ఉన్నామనే భావనలో ఉండరని తెలిపింది. క్రిస్టెన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Indian Railways: రైల్వేలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ఆఫర్లు.. చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఆ స్కీమ్‌లు ఏంటంటే..


Viral: ఏం క్రియేటివిటీ బాసూ.. క్లాస్‌లో పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తీయడానికి ఎలాంటి టెక్నిక్ వాడారో చూడండి..


Viral Video: వామ్మో.. ఇదెక్కడి సర్‌ప్రైజ్ రా బాబూ.. బర్త్‌డే విషెస్ పేరుతో ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్‌కు నిప్పు.. తర్వాతేం జరిగిందంటే..


IQ Test: మీ ఐక్యూ ఏ స్థాయిలో ఉందో టెస్ట్ చేసుకోండి.. ఈ ముగ్గురిలో బాస్ ఎవరో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Sep 28 , 2024 | 01:19 PM