ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: హాస్పిటల్ బెడ్ మీదున్న యజమాని.. పాకుతూ వచ్చిన ఏనుగు ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్!

ABN, Publish Date - Jul 24 , 2024 | 09:03 AM

కొన్ని జంతువులు మనుషుల పట్ల ఎంతో ప్రేమతో, విశ్వాసంతో ఉంటాయి. ఆహారం ఇచ్చి, రక్షణగా నిలిచిన వ్యక్తుల పట్ల కృతజ్ఞతను ఎప్పటికీ కోల్పోవు. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు, గుర్రాలు, ఏనుగులు మనుషులతో ఎమోషనల్ బాండింగ్‌ను ఏర్పరుచుకుంటాయి. తాము అభిమానించే వారికి ఏమైనా జరిగితే తట్టుకోలేవు.

Elephant says goodbye to his terminally ill caretaker

కొన్ని జంతువులు (Animals) మనుషుల పట్ల ఎంతో ప్రేమతో, విశ్వాసంతో ఉంటాయి. ఆహారం ఇచ్చి, రక్షణగా నిలిచిన వ్యక్తుల పట్ల కృతజ్ఞతను ఎప్పటికీ కోల్పోవు. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు, గుర్రాలు, ఏనుగులు మనుషులతో ఎమోషనల్ బాండింగ్‌ను ఏర్పరుచుకుంటాయి. తాము అభిమానించే వారికి ఏమైనా జరిగితే తట్టుకోలేవు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. జీవితాంతం తన బాధ్యతలు చూసుకున్న వ్యక్తి చివరి దశలో హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు ఏనుగు (Elephant)చేసిన పని చాలా మందిని భావోద్వేగానికి గురి చేసింది (Viral Video).


@Yoda4ever అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఏనుగు రూమ్ బయట కూర్చుని ఉంది. ఆ తర్వాత ఆ ఏనుగు పాకుతూ ఆ గది లోపలికి ప్రవేశించింది. ఆ గదిలో వృద్ధుడైన ఆ ఏనుగు కేర్ టేకర్ బెడ్‌పై ఉన్నాడు. అతడి దగ్గరకు వెళ్లిన ఏనుగు తన తొండంతో ఆ వ్యక్తి చేతిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. చివరి దశలో ఉన్న ఆ వృద్ధుడు తన చేతిని పైకి లేపలేకపోయాడు. దాంతో పక్కనే ఉన్న మహిళ ఆ వ్యక్తి చేతిని పట్టుకుని ఏనుగుకు అందించింది. వారి మధ్య ఉన్న అనుబంధాన్ని చూసిన వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.


ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 47 లక్షల మందికి పైగా వీక్షించారు. 90 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఎమోషనల్ కామెంట్లు చేశారు. ``ఇది జంతువులకు మాత్రమే సాధ్యం``, ``కన్న కొడుకులకు కూడా ఇంత ప్రేమ ఉండదు``, ``జంతువులు చాలా స్వచ్ఛంగా ప్రేమిస్తాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: జింకను సులభంగానే చంపేసింది కానీ, దానిని తీసుకెళ్లడానికి పులి ఎన్ని ఆపసోపాలు పడుతోందో చూడండి..!


Picture Puzzle: మీ అబ్జర్వేషన్ స్కిల్స్‌కు టెస్ట్.. ఆ రెండు ఫొటోల్లోని 3 తేడాలను 20 సెకెన్లలో కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 24 , 2024 | 09:03 AM

Advertising
Advertising
<