Viral Video: ఇది బైకు లాంటి సైకిల్.. ఈ పెద్దాయన తెలివితేటలు చూస్తే.. శభాష్ అనకుండా ఉండలేరు..
ABN, Publish Date - Jan 26 , 2024 | 09:50 PM
వినూత్నంగా ఆలోచించాలే గానీ.. పనికిరావని పక్కన పడేసే వస్తువులను కూడా వినియోగంలోకి తీసుకురావచ్చు. అయితే ఇది అందరి వల్ల సాధ్యం కాదు. కొందరు మాత్రం మిగతా వారికి భిన్నంగా ఆలోచిస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇంకొందరు..
వినూత్నంగా ఆలోచించాలే గానీ.. పనికిరావని పక్కన పడేసే వస్తువులను కూడా వినియోగంలోకి తీసుకురావచ్చు. అయితే ఇది అందరి వల్ల సాధ్యం కాదు. కొందరు మాత్రం మిగతా వారికి భిన్నంగా ఆలోచిస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇంకొందరు చదువురాకున్నా.. తమ తెలివితేటలకు పని చెప్పి అద్భుతాలు సృష్టిస్తుంటారు. ఇలాంటి వ్యక్తుల ప్రయోగాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పెద్దాయన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వృద్ధుడు తన సైకిల్‌కు బైకు పార్టులు అతికించి వెరైటీగా తయారు చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తు్న్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్దాయన తన పాత సైకిల్‌ను (old cycle) సరికొత్తగా మార్చాలని అనుకున్నాడు. ఇందుకోసం కాస్త వెరైటీగా ఆలోచించాడు. పాత హీరో స్ప్లెండర్ బైకు (Old Hero Splendor bike) స్పేర్ పార్ట్స్‌ను తీసుకున్నాడు. సైకిల్ హ్యాండిల్ స్థానంలో బైకు హ్యాండిల్ అమర్చాడు. దానికి ముందు వైపు లైటుతో పాటూ హారన్ కూడా ఏర్పాటు చేశాడు. అలాగే సైకిల్ సీటు స్థానంలో బైకు సీటును అమర్చాడు.
ఇలా సైకిల్ పైభాగం మొత్తం చూసేందుకు బైకులా ఉండేలా ఏర్పాట్లు చేశాడు. లైటుకు విద్యుత్ సరఫరా చేసేందుకు, సైకిల్ సైడ్ ఉన్న బ్యాగులో బ్యాటరీని అమర్చాడు. ఇలా రాత్రిళ్లు కూడా ఎలాంటి భయం లేకుండా వెళ్లే ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది హీరో హోండా.. లేటెస్ట్ వర్షెన్ లా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘పెద్దాయనా.. మీరు సూపర్’’.. అంటూ మరికొందరు, ‘‘ఇది కదా టాలెంట్ అంటే’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4.50లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Puzzle Photo: ఈ రెండు ఫొటోల్లో ఐదు తేడాలున్నాయి.. పది సెకన్లలో కనిపెడితే మీరే తోపు..
Updated Date - Jan 26 , 2024 | 09:50 PM