ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ఆనంద్ మహీంద్రాను ఆకర్షించిన స్ట్రీట్ వెండర్.. పానీపూరీ బండిని లాగేందుకు ఏకంగా..

ABN, Publish Date - Jan 24 , 2024 | 01:46 PM

గుండ్రటి పూరీ, దాల్ కుర్మా, పుదీనా వాటర్, ఖట్టా మీటా ఫ్లేవర్స్.. అబ్బా.. చెబుతుంటేనే నోరూరిపోతోంది కదూ.. అవును మరి.. పానీపూరీకి ఉన్న క్రేజ్ అలాంటిది.

గుండ్రటి పూరీ, దాల్ కుర్మా, పుదీనా వాటర్, ఖట్టా మీటా ఫ్లేవర్స్.. అబ్బా.. చెబుతుంటేనే నోరూరిపోతోంది కదూ.. అవును మరి.. పానీపూరీకి ఉన్న క్రేజ్ అలాంటిది. చిన్న గల్లీ నుంచి స్టార్ హోటల్ వరకు దర్శనమిచ్చే ఈ స్నాక్ ఐటమ్ విక్రయాన్నే జీవనోపాధిగా మార్చుకున్నారు న్యూఢిల్లీకి చెందిన తాప్సీ ఉపాధ్యాయ్. యువ వ్యాపారవేత్తగా ఎంతో ఫేమస్ అయిన ఆమె సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తుంటారు. బీటెక్ పానీపూరి వాలీ పేరుతో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన తాప్సీ ఉపాధ్యాయ్ పానీపూరీ విక్రయాన్ని బిజినెస్ గా ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్టే ఓ వ్యాన్ ను కొనుగోలు చేసి దాని రూపురేఖలు మార్చేశారు. పానీపూరీలు చేసి, విక్రయించేందుకు వీలుగా ఏర్పాటు చేసుకున్నారు. వ్యాపారం బాగా సాగడంతో ఆమె గురించి చుట్టుపక్కలా ఉన్నవాళ్లందరికీ తెలిసింది. వీడియోలు తీయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండేవారు. దీంతో తాప్సీ ఉపాధ్యాయ్ సామాజిక మాధ్యమాల్లోనూ ఫేమస్ గా మారారు. అయితే.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా.. తాప్సీ చేసిన ఈ వీడియోను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.

వైరల్ అవుతున్న వీడియోలో తాప్సీ ఉపాధ్యాయ్.. తన పానీపూరీ బండిని లాగేందుకు ఏకంగా మహీంద్రా థార్ ను ఉపయోగించారు. థార్ కు పానీపూరీ బండిని జాయింట్ చేసి స్వయంగా నడుపుకుంటూ వెళ్లడాన్ని చూడవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. అలా అలా ఆనంద్ మహీంద్రా వద్దకూ చేరింది. ఆయన వెంటనే ఈ వీడియోను తన ట్విట్టర్ - ఎక్స్ హ్యాండిల్ లో ట్వీట్ చేశారు. ప్రజలు ఎదగడానికి, వారి కలలను సాకారం చేసుకోవడానికి తమ కార్లు ఉపయోగపడాలని తాము కోరుకుంటున్నట్లు వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 24 , 2024 | 01:46 PM

Advertising
Advertising