ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Anand Mahindra: ఎంత మంచి మనసు తల్లీ నీది! ఈ బాలిక గొప్పతనం తెలిసి ఆనంద్ మహీంద్రానే ఫిదా!

ABN, Publish Date - Feb 23 , 2024 | 03:33 PM

నాలుగో క్లాసు చదివే ఓ బాలిక మంచి మనసు గురించి తెలిసి ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయిపోయారు. ఆమె స్టోరీని నెట్టింట పంచుకున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఆ చిన్నారి చదివేది నాలుగో క్లాసేకానీ (class 4 student) ఆమె దొడ్డ మనసు చూసి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఫిదా అయిపోయారు. దీంతో, ఆమె గురించి నెట్టింట తన ఫాలోవర్లతో పంచుకున్నారు. అంతేకాకుండా, చిన్నారి మంచి మనసు గురించి మొదటగా ప్రపంచానికి తెలియజేసిన ఆమె తల్లికి కూడా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

వర్ష అనే మహిళ తన కూతురి గురించి ఇటీవల నెట్టింట పంచుకుంది. మహిళ తెలిపిన వివరాల ప్రకారం, సుమారు నెలన్నర క్రితం ఆమె ఏదో గ్రూపులో ఓ ముఖ్యమైన మెసేజ్ చూసింది. దివ్యాంగురాలైన తన కూతురికి పరీక్షల్లో సాయం చేసేందుకు నాలుగో క్లాస్ చదివే చిన్నారులు కావాలంటూ ఓ మహిళ పెట్టిన మెసేజ్ అది. ప్రశ్న పత్రంలోని ప్రశ్నలను దివ్యాంగురాలికి చదివి వినిపించి ఆమె చెప్పే సమాధానం విని సమాధానపత్రంలో రాయాలి. ఈ మెసేజ్ చూడగానే వర్షకు సాయం అందించాలని అనిపించింది. తన కూతురూ నాలుగో తరగతే కాబట్టి విషయం ఆమెకు చెప్పి సాయం చేయడానికి వెళతావా అని అడిగింది. అప్పటికి వర్ష కూతురికి కూడా పరీక్షలు ఉన్నాయి. కానీ ఆ చిన్నారి మాత్రం దివ్యాంగురాలికి సాయం చేసేందుకు వెంటనే ఓకే చెప్పింది (Class 4 student who helps specially abled child).

Viral: స్కూల్లో ఫ్రెండ్‌కు కొన్నేళ్ల పాటు హోం వర్క్ చేసిచ్చిన బాలిక.. పెద్దయ్యాక అతడిచ్చిన గిఫ్ట్ చూసి..


ఆ తరువాత వర్ష.. గ్రూప్‌లో పెట్టిన మహిళకు ఫోన్ చేసి విషయం చెప్పింది. తాము సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. అన్నమాట ప్రకారం వర్ష కూతురు తన పరీక్షల మధ్యలో ఖాళీ రోజుల్లో వెళ్లి దివ్యాంగురాలి తరపున పరీక్ష రాసి వచ్చింది. తమ సమస్య తీరినందుకు ఆ దివ్యాంగురాలు, ఆమె తల్లీ ఎంతో సంతోషించారు.

Empty Airplane: ఇద్దరే ప్రయాణికులతో బయలుదేరిన విమానం.. ఒంటరిగా ఉండటంతో తోటి ప్రయాణికుడు చేసిన పనికి..

ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్న వర్ష..దివ్యాంగులు ఎంతటి కష్టాలు పడుతున్నారో అర్థం చేసుకున్నట్టు వివరించింది. వారి కోసం పరీక్షల్లో రీడర్స్ అండ్ రైటర్స్ దొరకడం ఎంతో కష్టంగా మారిందని ఆమె వాపోయింది. విద్యలో సమానత్వం కోసం ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

వర్ష చేసిన ట్వీట్‌ను ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. ఈ చిన్న సాయం ఎందరి మనసులనో కదిలించిందన్నారు. ఇలాంటి చిన్న చిన్న సాయాలే సమాజాంలో ఆనందం నింపుతాయని వ్యాఖ్యానించారు. ఇంతటి స్ఫూర్తిదాయక విషయాన్ని షేర్ చేసినందుకు వర్షకు కూడా ధన్యవాదాలు తెలిపారు. మనసుల్ని కదిలించేలా ఉన్న ఈ పోస్ట్ సహజంగానే వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా బాలిక, ఆమె తల్లి వర్షపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 23 , 2024 | 03:43 PM

Advertising
Advertising