Anand Mahindra: దోమలను చంపే లేజర్ మెషిన్.. ఐరన్ డోమ్ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా!
ABN, Publish Date - Aug 24 , 2024 | 02:14 PM
దేశంలోని చాలా ప్రధాన నగరాలు డెంగీతో వణికిపోతున్నాయి. దోమల నియంత్రణకు ఆయా స్థానిక యంత్రాంగాలు చర్యలు తీసుకుంటున్నా అవేవీ ఫలితాలను ఇవ్వడం లేదు. దీంతో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా ద్వారా ఓ సూచన చేశారు.
ముంబై (Mumbai)లో డెంగీ కేసులు (Dengue cases) రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒక్క ముంబైలోనే కాదు.. దేశంలోని చాలా ప్రధాన నగరాలు డెంగీతో వణికిపోతున్నాయి. దోమల (Mosquitos) నియంత్రణకు ఆయా స్థానిక యంత్రాంగాలు చర్యలు తీసుకుంటున్నా అవేవీ ఫలితాలను ఇవ్వడం లేదు. దీంతో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సోషల్ మీడియా ద్వారా ఓ సూచన చేశారు. డెంగీ కేసులు పెరిగిపోతున్న వేళ దోమలను నివారించే మెషిన్‌కు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు (Viral Video).
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా ఆసక్తికర, ఫన్నీ వీడియోలను మాత్రమే కాదు.. వర్తమాన అంశాలపై కూడా స్పందిస్తుంటారు. తాజాగా ఆయన దోమలను చంపే మెషిన్‌కు (Mosquito-killing device) సంబంధించిన వీడియోను పంచుకున్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మెషిన్ ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ లేజర్ కిరణాలతో దోమలను చంపే ఓ మినేయేచర్ క్యానన్ కనబడుతోంది. ఆ మెషిన్‌ను చైనాకు చెందిన ఓ ఇంజినీర్ రూపొందించాడట. చిన్న సైజు యాంటీ-మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌లా కనబడుతున్న ఓ మెషిన్‌లో ఓ రాడార్ వ్యవస్థ ఉంటుంది. ఇది చుట్టు పక్కల ఎగురుతున్న దోమలను గుర్తిస్తుంది.
దోమలను గుర్తించిన వెంటనే దానిలో ఉన్న లేజర్ పాయింటర్ వాటిని చంపేస్తుంది. ఇలా నిమిషాల వ్యవధిలోనే ఆ మెషిన్ ఎన్నో దోమలను చంపేస్తుంది. ఈ వీడియోను పంచుకున్న ఆనంద్ మహీంద్రా తాను కూడా అలాంటి మెషిన్ కొనడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. డెంగీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఆ మెషిన్ మన ఇంటికి ఐరన్ డోమ్‌లా పని చేస్తుందని అన్నారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 24 , 2024 | 02:14 PM