Share News

Tour Plans:దసరా సెలవులకు లాంగ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఇవైతే బెస్ట్

ABN , Publish Date - Sep 30 , 2024 | 07:47 AM

అక్టోబర్‌లో మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే యాత్రను ఎలా ప్లాన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Tour Plans:దసరా సెలవులకు లాంగ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఇవైతే బెస్ట్

హైదరాబాద్: స్నేహితులు, కుటుంబ సభ్యులతో అక్టోబర్‌లో లాంగ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా. మీ కోసమే చాలా టూరిస్టు ప్రాంతాలు ఆకర్షణీయమైన ప్లాన్‌లతో రెడీగా ఉన్నాయి. అక్టోబర్‌లో వర్షాకాలం ముగిసి చలికాలానికి పుడిమితల్లి స్వాగతం తెలుపుతుంది. దీంతో టూరిస్టు ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ప్రయాణం మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే యాత్రను ఎలా ప్లాన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మౌంట్ అబూ

ఎంతో మందికి అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రదేశం మౌంట్ అబూ. వర్షాకాలంలో ఇక్కడ ప్రక‌ృతి అందం మరింత పెరుగుతుంది. ప్రకృతి రమణీయమత చూపు తిప్పుకోకుండా చేస్తుంది.

వయనాడ్

అక్టోబర్‌లో లాంగ్ వీకెండ్స్‌లో వయనాడ్‌కు వెళ్లొచ్చు. ప్రకృతి అందాలతో రమణీయంగా కనిపించే ట్రీ హౌస్, వత్తిరి, చెంబ్రా శిఖరం, కురువా ద్వీపం, తిరునెల్లి ఆలయం వంటి ప్రసిద్ధ ప్రదేశాలను వయనాడ్‌లో చూడవచ్చు.


మున్నార్

ప్రకృతి అందాలతో కనులవిందు చేసే మున్నార్.. యాత్రకు ఉత్తమమైనది ప్రాంతం. ఇక్కడ టూరిస్టులు ప్రత్యేక అనుభూతి పొందుతారు. మున్నార్‌లోని కొండలపై తేయాకు తోటలు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ హౌస్‌బోట్‌తో సహా అనేక ఇతర ప్రాంతాలను సందర్శిస్తూ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయవచ్చు.

గోవా

గోవా ట్రిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా. మీలో ఎంతో మంది గోవా ట్రిప్ ఎంజాయ్ చేసి ఉంటారు. అక్టోబర్‌లో స్నేహితులంతా కలిసి గోవా ట్రిప్ వేయొచ్చు. లాంగ్ వీకెండ్ ట్రిప్ కోసం గోవా ఉత్తమ పర్యటక ప్రాంతం. ఆహ్లాదకరమైన, చల్లని వాతావరణానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం యువతకు ఇష్టమైనది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యామిలీతోనూ ఎంచక్కా ట్రిప్ ఎంజాయ్ చేయొచ్చు.


ప్లాన్ ఎలా..

సీజన్ మారే కాలం కావడంతో అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మీరు వెళ్లాలనుకున్న పర్యాటక ప్రాంతం గురించి ముందుగానే సమాచారాన్ని సేకరించండి. అడ్వాన్స్‌గా హోటల్ బుకింగ్‌ చేసుకోండి. అన్ని పర్యాటక ప్రాంతాలకు బస్సులు, రైళ్లు, విమాన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అయితే ప్రాంతాన్ని బట్టి ఇవి మారుతుంటాయి. కాబట్టి సౌకర్యవంతంగా ఉండేలా ట్రిప్ ప్లాన్ చేసుకోండి. ఐఆర్‌సీటీసీ కూడా దేశంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల మీదుగా రైళ్లు నడుపుతోంది. భారతీయ రైల్వే అధికారిక వెబ్ సైట్‌లోకి వెళ్లి ఆ వివరాలు చూడవచ్చు.

Gold Prices Today: మగువలకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు

For Latest News and National News click here

Updated Date - Sep 30 , 2024 | 11:16 AM