Miss Universe: అందాల పోటీల్లో సరికొత్త సంచలనం.. 60 ఏళ్ల మహిళకు అందాల కిరీటం..!
ABN, Publish Date - Apr 27 , 2024 | 12:39 PM
అర్జెంటీనాకు చెందిన 60 ఏళ్ల అలెజాండ్రా రొడ్రిగోజ్ సరికొత్త సంచలనం సృష్టించింది. 60 ఏళ్ల వయసులో అందాల పోటీల్లో పాల్గొని కిరీటం దక్కించుకుంది. వృత్తిరీత్యా న్యాయవాది, జర్నలిస్ట్ అయిన రొడ్రిగోజ్ సంకల్పానికి వయసు అడ్డు కాదని నిరూపించింది.
అందాల పోటీలంటే మనకు యుక్తవయసులోని యువతులే గుర్తుకు వస్తారు. వారికే అందాల కిరీటం దక్కించుకునే అర్హత ఉందనుకుంటాం. అయితే ఆ ఆలోచనలను పటాపంచలు చేస్తూ అర్జెంటీనా (Argentina)కు చెందిన 60 ఏళ్ల అలెజాండ్రా రొడ్రిగోజ్ (Alejandra Rodríguez) సరికొత్త సంచలనం సృష్టించింది. 60 ఏళ్ల వయసులో అందాల పోటీల్లో పాల్గొని కిరీటం దక్కించుకుంది. వృత్తిరీత్యా న్యాయవాది, జర్నలిస్ట్ అయిన రొడ్రిగోజ్ సంకల్పానికి వయసు అడ్డు కాదని నిరూపించింది (Viral News).
అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో ఇటీవల జరిగిన అందాల పోటీల్లో లా ప్లాటా నగరానికి చెందిన 60 ఏళ్ల రొడ్రిగోజ్ పాల్గొంది. టీనేజ్ అమ్మాయిలను కూడా వెనక్కి నెట్టి ``మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్`` (Miss Universe Buenos Aires) టైటిల్ గెలుచుకుంది. అందాల పోటీల్లో కిరీటం గెలుచుకున్న అతి పెద్ద వయస్కురాలిగా నిలిచింది. ఈ ఏడాది మే నెలలో జరగబోయే ``మిస్ యూనివర్స్ అర్జెంటీనా`` పోటీలో రొడ్రిగోజ్ పాల్గొనబోతోంది. ఆ పోటీల్లో కూడా గెలిస్తే సెప్టెంబర్‌లో మెక్సికో వేదికగా జరిగే ``మిస్ యూనివర్స్ 2024`` (Miss Universe 2024) పోటీల్లో పాల్గొనే అవకాశం వస్తుంది.
గతంలో మిస్ యూనివర్స్ అందాల పోటీలో పాల్గొనే మహిళల వయసు 18-28 ఏళ్ల మధ్య ఉండాలనే నియమం ఉండేది. అయితే ఆ వయో పరిమితిని తొలగిస్తూ గతేడాది మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడిన మహిళలందరూ మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించింది. దీంతో వయసు పైబడిన వారు కూడా అందాల పోటీల్లో పాల్గొనే వీలు దక్కింది. ఇటీవల డొమనికన్ రిపబ్లికన్‌కు చెందిన 47 ఏళ్ల హైదీ క్రూజ్ ఆ దేశ అందాల కిరీటం దక్కించుకుంది. మిస్ యూనివర్స్ పోటీల్లో ఆ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. మరి, అర్జెంటీనా నుంచి రొడ్రిగోజ్‌కు ఎంట్రీ లభిస్తోందో, లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి..
Personality Test: మీ మొహం ఏ షేప్‌లో ఉంది?.. మీ మొహం ఆకృతిని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 27 , 2024 | 12:39 PM