ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayodhya Rama Mandar: ఉచితంగా శ్రీరాముడి టాటూలు..

ABN, Publish Date - Jan 19 , 2024 | 01:48 PM

అయోధ్య రామమందిరంలో రామలల్లా విగ్రహ ప్రతిష్ఠాపన వేళ దేశవ్యాప్తంగా భక్తిపారవశ్యం వి భిన్న రూపాలలో సాగుతోంది.

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): అయోధ్య రామమందిరంలో రామలల్లా విగ్రహ ప్రతిష్ఠాపన వేళ దేశవ్యాప్తంగా భక్తిపారవశ్యం విభిన్న రూపాలలో సాగుతోంది. బెళగావి దక్షిణ ఎమ్మెల్యే అభయ పాటిల్‌ నేతృత్వంలో ఉచితంగా టాటూల వేయించే కార్యక్రమం ఆరంభించారు. నగర వ్యాప్తంగా ఇందుకోసమే మూడు ప్రత్యేక కేంద్రాల ను గురువారం లాంఛనంగా ఆరంభించారు. ఈనెల 22వ తేదీ వరకూ ఉచితంగా టాటూల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. నియోజకవర్గ పరిధిలో కనీసం పదివేల మందికి వేయించదలచామన్నారు. బీపీ, మధుమేహంతో పాటు ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉండేవారు పాల్గొనరాదని కోరారు. భక్తులు తమ ఇష్టదైవంగా భావించే శ్రీరాముడి రూపాన్ని టాటూలు ఉచితంగా వేయిస్తామన్నారు. ప్రజల నుంచి స్పందన ఉంటుందా అని భావించామన్నారు. కానీ భక్తులు క్యూకట్టి మరీ టాటూలు వేయించుకుంటున్నారన్నారు. మహిళలు పెద్దఎత్తున వస్తున్నారన్నారు. రామభక్తుడు విఠల మాట్లాడుతూ శ్రీరాముడు ట్యాటూ అత్యంత ఇష్టంతో వేయించుంటున్నామన్నారు.

Updated Date - Jan 19 , 2024 | 01:48 PM

Advertising
Advertising