ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: కారు డోర్‌ తీసేటప్పుడు జాగ్రత్త!.. షాకింగ్ వీడియో షేర్ చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

ABN, Publish Date - Feb 13 , 2024 | 03:17 PM

వాహన ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తాయో చెప్పలేం. అయితే అప్రమత్తంగా ఉంటే కొంతమేరకు ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అలాంటి సందేశాన్ని ఇచ్చే ఓ వీడియోను షేర్ చేశారు. కారు డోర్ తెరిచేటప్పుడు అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు ఎంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరించే వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

వాహన ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తాయో చెప్పలేం. అయితే అప్రమత్తంగా ఉంటే కొంతమేరకు ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాంటి సందేశాన్ని ఇచ్చే ఓ వీడియోను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ షేర్ చేశారు. కారు డోర్ తెరిచేటప్పుడు అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ వీడియోలో ఓ బైకర్ అటుగా వస్తుండగా ఓ వ్యక్తి అకస్మాత్తుగా కారు డోర్‌ను తెరిచారు. దీంతో బైకర్ ఈ డోర్‌కు బలంగా తగిలి గాల్లోకి లేచి పక్కన అటుగా వెళ్తున్న లారీ కింద పడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ అతడు లారీ చక్రాల కింద పడకపోవడంతో ప్రాణాలు దక్కాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సజ్జనార్ షేర్ చేశారు.

‘‘ కారు డోర్‌ తీసేటప్పుడు జాగ్రత్త! వెనుక నుంచి వస్తున్న వాహనదారులను గమనించి కారు డోర్‌ తీయండి. తొందరంగా వెళ్లాలనే హడావుడిలో ఇలా అజాగ్రత్త, నిర్లక్ష్యంగా వ్యవహారించి ప్రమాదాలకు కారణం కాకండి. ఎందుకంటే అందరికీ ఈ బైకర్‌లా అదృష్టం వరించదు’’ అంటూ సజ్జనార్ ‘ఎక్స్’ రాసుకొచ్చారు.

Updated Date - Feb 13 , 2024 | 03:20 PM

Advertising
Advertising