కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఇంత అందంగా ఉన్న ఈ యువతి.. అంతలోనే ఎలా భయపెట్టిందో చూడండి..

ABN, Publish Date - Jan 07 , 2024 | 06:37 PM

ఒక్కొక్కరిలో ఓ స్పెషాలిటీ ఉంటుంది. కొందరు మిగతా వారికి భిన్నంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. కొందరు వింత వింత విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు...

Viral Video: ఇంత అందంగా ఉన్న ఈ యువతి.. అంతలోనే ఎలా భయపెట్టిందో చూడండి..

ఒక్కొక్కరిలో ఓ స్పెషాలిటీ ఉంటుంది. కొందరు మిగతా వారికి భిన్నంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. కొందరు వింత వింత విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు తమ అవయవాలనే వినూత్నంగా ప్రదర్శిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చూడటానికి ఎంతో అందంగా ఉన్న ఆ యువతిని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇంతకీ ఆమెలోని స్పెషాలిటీ ఏంటో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ అందమైన యువతి (Beautiful woman) కెమెరా ముందకు వచ్చి అందరికీ హాయ్ చెబుతుంది. చక్కటి స్మైల్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే అంతలోనే తన పొడవాటి నాలుకను (Long tongue) బయటికి పెట్టి.. ఒక్కసారిగా అందరినీ భయపెడుతుంది. ఆమె నాలుక అందరిలా కాకుండా చాలా పొడవుగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

Viral Video: జీతం పడలేదని భార్యాభర్తల వింత నిర్వాకం.. నేరుగా ఆఫీసుకు వెళ్లి వారు చేసిన నిర్వాకంతో..

ఇలాంటి పొడవాటి నాలుక చాలా అరుదుగా ఉండడంతో అంతా ఈమెను చూసి.. థ్రిల్లర్ సినిమా సీన్లను గుర్తు చేసుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! ఈమె నాలుకేంట్రా నాయనా.. ఇంత భయంకరంగా ఉంది’’.., ‘‘అందాల రాక్షసిలాగా ఉంది’’.., ‘‘థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టుంది బాబోయ్’’.., ‘‘నోటిలో నుంచి ఏకంగా పాము బయటికి వచ్చినట్లుంది’’.., ‘‘ఈమె నాగ కన్యలా ఉందే’’.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో! ఇదేం బ్యాటింగ్‌రా బాబోయ్.. చూస్తుండగానే పిచ్‌పై నీరు వరదాలా ఎలా పారించాడో చూడండి..

Updated Date - Jan 07 , 2024 | 06:37 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising