ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. పచ్చి మిరప లిప్‌స్టిక్.. బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ టిప్ చూస్తే మండిపోవడం ఖాయం..

ABN, Publish Date - Dec 12 , 2024 | 05:42 PM

ఎంతో మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రకరకాల అంశాల గురించి సమాచారం ఇస్తున్నారు. టిప్స్ చెబుతున్నారు. ముఖ్యంగా అందానికి సంబంధించి టిప్స్ ఇచ్చే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు రకరకాల ప్రయోగాలు చేస్తూ వాటిని జనాలకు తెలియజేస్తుంటారు.

Beauty influencer uses green chillies as Natural Lip Plumper

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎంతో సమాచారం స్మార్ట్ ఫోన్‌ల ద్వారా మన కళ్ల ముందుకు వస్తోంది. దేని గురించి తెలుసుకోవాలన్నా సెకెన్ల వ్యవధిలో సమాచారం దొరికేస్తోంది. ఎంతో మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రకరకాల అంశాల గురించి సమాచారం ఇస్తున్నారు. టిప్స్ చెబుతున్నారు. ముఖ్యంగా అందానికి సంబంధించి టిప్స్ (Beauty Tips) ఇచ్చే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు రకరకాల ప్రయోగాలు చేస్తూ వాటిని జనాలకు తెలియజేస్తుంటారు. ఢిల్లీకి చెందిన ఓ బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ (Beauty influencer) పెదవులకు సంబంధించి ఓ హాట్ టిప్ పంచుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


ఢిల్లీ (Delhi)కి చెందిన సుభాంగి ఆనంద్ అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బ్యూటీ టిప్స్ చెబుతుంటుంది. తాజాగా ఆమె లిప్ ‌ప్లంపర్‌ (Lip Plumper) గా పచ్చి మిరపకాయలను ఉపయోగించింది. పెదవులు సంపూర్ణంగా, వృత్తాకారంలో కనిపించేందుకు లిప్ పంప్లర్‌‌లను వాడతారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఆమె రెండు పచ్చి మిరపకాయలను (Chillies) మధ్యకు కోసింది. వాటితో తన పెదవులపై రాసుకుంది. కొద్దిసేపటికే ఆ పచ్చి మిర్చి తన ప్రతాపం చూపించింది. ఆ తర్వాత లిప్ టింట్ పూసుకుని, మరో లేయర్ వేసుకుని తన మేకప్‌ను పూర్తి చేసుకుంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 22 లక్షల మంది వీక్షించారు. సుభాంగి వీడియోను 2.25 లక్షల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``దీనిని ఎవరైనా ట్రై చేస్తారా``, ``ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంత కంటే చెత్త టిప్ మరొకటి చూడలేదు``, ``నేను కూడా ఇలాంటి ప్రయోగం చేశాను. కానీ, ఇది చాలా సమస్యలు కలిగిస్తుంది``, ``మంచి బ్రాండ్‌కు చెందిన లిప్ ప్లంపర్ కొనుక్కుంటే సరిపోతుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ప్రమాదానికి హాయ్ చెప్పడం అంటే ఇదే.. రైలు గేటుకు వేలాడుతూ రీల్.. చివరకు ఆమె ఏమైందంటే..


Pushpa-2: ఇది ``పుష్ప-2`` సైడ్ ఎఫెక్ట్.. థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడికి చుక్కలు.. అసలేం జరిగిందంటే..


Optical Illusion Test: మీ కళ్లకు, బ్రెయిన్‌కు టెస్ట్.. ఈ రాళ్ల మధ్యలో ఉన్న కుక్కను 5 సెకెన్లలో పట్టుకోండి..


Viral Video: వామ్మో.. కుక్కను మింగేసి కదల్లేకపోతున్న భారీ కొండ చిలువ.. షాకింగ్ వీడియో వైరల్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 12 , 2024 | 05:42 PM