ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Best Visiting Places: హైదరాబాద్‌‌లో ప్రేమికుల మనసు దోచుకునే పర్యాటక ప్రాంతాలివే..

ABN, Publish Date - Jan 13 , 2024 | 12:58 PM

ప్రేమలో ఉన్న వారు ప్రపంచంతో సంబంధం లేకుండా తమ ప్రపంచంలో తాము మునిగిపోతుంటారు. వీలు చిక్కితే చాలు మంచి మంచి పర్యాటక ప్రాంతాలను...

ప్రేమలో ఉన్న వారు ప్రపంచంతో సంబంధం లేకుండా తమ ప్రపంచంలో తాము మునిగిపోతుంటారు. వీలు చిక్కితే చాలు మంచి మంచి పర్యాటక ప్రాంతాలను చుట్టేస్తూ ఏకాంతంగా గడపడానికి ఇష్టపడుతుంటారు. హైదరాబాద్ నగరంలో ప్రేమికులు ఎక్కువగా ఇష్టపడే కొన్ని పర్యాటక ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.హుస్సేన్ సాగర్

హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్ బెస్ట్ వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడి సరస్సు, అందులో బోటింగ్ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఇక రాత్రి వేళల్లో ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే ఎంతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. అందుకే ఎక్కవ శాంత మంది ఇక్కడికి రాత్రి సమయంలో సందర్శించేందుకు ఆసక్తి చూపుతుంటారు.

2.గోల్కొండ కోట

రాజుల కాలం నాటి గోల్కొండ కోట కూడా హైదరాబాద్‌ నగంలోని పర్యాటక ప్రాంతాల్లో ప్రముఖమైనదిగా చెప్పొచ్చు. రాత్రి వేళ ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారికి మంచి అనుభూతి మిగిలిపోతుంది. నిత్యం ఇక్కడికి అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చిపోతుంటారు.

3.దుర్గం చెరువు

హైదరాబాద్ నగంరలో చూడదగ్గ ప్రదేశాల్లో దుర్గం చెరువు ఒకటి. ఈ చెరువుపై నూతనంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ బ్రిడ్జిపై వాకింగ్, సైక్లింగ్ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు.


4. శిల్పారామం

నగరంలోని శిల్పారామం కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడి అందమైన ప్రదేశాలు, స్టాల్స్, కేఫ్‌లు, సాంస్కృతిక ప్రదర్శనలను పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తాయి.

5.కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్

నగరంలోని కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్‌ కూడా పర్యాటకలకు ఆకట్టుకుంటుంది. ఇక్కడ వాకింగ్ చేయడమే కాకుండా అందమైన ప్రకృతిని వీక్షిస్తూ ఉల్లాసంగా గడిపేందుకు అవకాశం ఉంటుంది.

6. ఫలక్‌నుమా ప్యాలెస్

హైదరాబాద్ నగంరంలోని ఫలక్‌నుమా ప్యాలెస్ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రాత్రి వేళల్లో ఈ ప్యాలెస్ మరింత అందంగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ప్యాలెస్‌లోని 60 విలాసవంతమైన గదులు, 22 విశాలమైన హాళ్లు, ఒకేసారి 100 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన డైనింగ్ టేబుల్ పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

7. రామోజీ ఫిల్మ్ సిటీ

హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో రామోజీ ఫిల్మ్ సిటీ ఒకటి. ఇండియాలో అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ స్టూడియో అయిన ఇందులో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. టోక్యో గార్డెన్, మొఘల్ గార్డెన్, రైల్వే, విమానాశ్రయాల మోడల్ స్టేషన్లు, అందమైన తోటలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

Updated Date - Jan 13 , 2024 | 01:12 PM

Advertising
Advertising