Bigg Boss Telugu 8 Grand Finale: బిగ్‌బాస్ ఫినాలేకు విష్ణుప్రియ సహా ఇద్దరు డుమ్మా.. రీజన్ ఇదే..
ABN, Publish Date - Dec 15 , 2024 | 02:46 PM
Bigg Boss Telugu 8 Grand Finale: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ముగింపు దశకు చేరుకుంది. ఇవాళ జరిగే ఫినాలేతో విన్నర్ ఎవరో తేలిపోనుంది. అయితే ఈసారి హౌస్‌లో సందడి తగ్గనుంది. ఏకంగా ముగ్గురు హౌస్‌మేట్స్ డుమ్మా కొట్టేశారని తెలుస్తోంది. వాళ్లు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ముగింపు దశకు చేరుకుంది. ఇవాళ జరిగే ఫినాలేతో విన్నర్ ఎవరో తేలిపోనుంది. సాధారణంగా ఫినాలే అనగానే ఉండే హడావుడి, సందడి గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. గెస్ట్‌లతో పాటు ఎక్స్ హౌస్‌మేట్స్, సెలబ్రిటీల పెర్ఫార్మెన్ దాకా ప్రతిదీ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. ప్రతి ఫైనల్స్‌కు సీజన్‌లో పార్టిసిపేట్ చేసిన హౌస్‌మేట్స్ కూడా వచ్చి హల్‌చల్ చేస్తుంటారు. మరీ అత్యవసరమైతే తప్ప వాళ్లు మిస్ అవ్వరు. అయితే ఈసారి హౌస్‌లో సందడి తగ్గనుంది. ఏకంగా ముగ్గురు హౌస్‌మేట్స్ ఫినాలేకు డుమ్మా కొట్టేశారని తెలుస్తోంది. విష్ణుప్రియ సహా మరో ఇద్దరు కంటెస్టెంట్స్ ఫినాలే మిస్ అయ్యారని సమాచారం. వాళ్లెవరో ఇప్పుడో లుక్కేద్దాం..
అదే రీజనా?
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ప్రోమో ఇప్పటికే వచ్చేసింది. అయితే ఇందులో కొందరు హౌస్‌మేట్స్ కనిపించడం లేదు. విష్ణుప్రియతో పాటు హరితేజ, నయని పావని ప్రోమోలో మిస్ అయ్యారు. దీంతో వీళ్లు నిజంగానే డుమ్మా కొట్టారా? లేదా హైడ్ చేస్తున్నారా? అనే డిస్కషన్స్ మొదలయ్యాయి. అదే టైమ్‌లో వీళ్లు రాలేదని.. దానికి కారణాలు కూడా చెబుతున్నారు. పృథ్వీతో విష్ణు చనువుగా ఉండటం అప్పట్లో నెగెటివ్ అయింది. ఆ కారణం వల్లే తను ఫినాలేకు రావట్లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనిపై క్లారిటీ లేదు.
విన్నర్ అతడే!
నయని పావని, హరితేజ రాకపోవడానికి గల రీజన్స్ మాత్రం తెలియడం లేదు. ఇటీవలే స్టార్ మాలో స్టార్ట్ అయిన గీత ఎల్‌ఎల్‌బీ ప్రమోషన్స్ కోసం హరితేజ ఓ వీడియో తయారు చేసింది. అలాంటప్పుడు ఫినాలేకు పక్కా రావాలి కదా.. ఎందుకు ఎగ్గొట్టిందని సోషల్ మీడియాలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. కాగా, ఈసారి బిగ్‌బాస్ విన్నర్‌గా తెలుగోడే ఫిక్స్ అంటూ రూమర్స్ వస్తున్నాయి. నబీల్ లేదా గౌతమ్‌ల్లో ఒకరు గెలుస్తారని ప్రచారం జరుగుతోంది. విజేత ఎవరనేది ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది.
Also Read:
ఈ పోలీసు అతి తెలివి మామూలుగా లేదుగా.. చలికి తట్టుకోలేక ఖైదీతో..
సింహాన్ని చుట్టేసిన కొండచిలువ.. చివరికి ఏమైందో చూస్తే కళ్లు తేలేస్తారు..
వామ్మో.. ఇదేంటీ.. చలి నుంచి తప్పించుకోవాలని మంటపై పడుకున్న వ్యక్తి.. చివరికి జరిగింది చూస్తే..
For More Prathyekam And Telugu News
Updated Date - Dec 15 , 2024 | 02:53 PM