Bigg Boss Telugu 8: తెలుగు బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్ ఏవరంటే.. ప్రైజ్ మనీ ఏకంగా..
ABN, Publish Date - Dec 15 , 2024 | 03:10 PM
బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే ఇంకొన్ని గంటల్లో జరగనుంది. ఇందులో విజేత ఎవరో తేలనుంది. అయితే ఈ పోటీలో చివరగా ఎవరు విజేతగా నిలిచారు, ఎవరు తప్పుకున్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 (Bigg Boss Telugu 8) కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇంకొన్ని గంటల్లో బిగ్ బాస్ తెలుగు 8 విజేత ఎవరనేది (bigg boss telugu 8 winner) తేలనుంది. అయితే ప్రస్తుతం ఈ పోటీలో ఫైనల్ లెవల్‌లో ఐదుగురు పోటీ పడుతున్నారు. వారిలో గౌతమ్, నిఖిల్, నబిల్ అఫ్రిది, ప్రేరణ, అవినాష్ ఈ ప్రతిష్టాత్మకమైన ట్రోఫీ కోసం సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో దీని కోసం ఆసక్తితో ఉన్న అభిమానుల్లో మాత్రం ట్రోఫీ ఎవరికి వస్తుందోనని టెన్షన్‌తో ఎదురుచూస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈరోజు స్టార్ స్టాడ్ గ్రాండ్ ఫినాలే అద్భుతంగా జరగనుంది. అయితే ఫైనల్ గురించి వచ్చిన సమాచారం ప్రకారం విన్నర్ ఎవరనేది దాదాపు తెలిసిపోయిందనే టాక్ వినిపిస్తోంది.
టాప్ 5 రేసు నుంచి...
బిగ్ బాస్ తెలుగు 8లో ఫైనల్ ఎలిమినేషన్‌లో ఈ రోజు ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది. ఆ తరువాత ఉన్న ఇద్దరిలో ఒకరు విన్నర్‌గా నిలవనున్నారు. మరొకరు రన్నర్‌గా నిలుస్తారు. ఈ ఇద్దరు ఎవరనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్‌లో ఏకైక మహిళా ఫైనలిస్ట్ అయిన ప్రేరణ నాల్గవ ఫైనలిస్ట్‌గా ఫైనల్ టైటిల్ రేసు నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న డాకు మహరాజ్ సినిమాలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అతిథిగా వచ్చి బిగ్ బాస్ హౌస్‌లోంచి ప్రేరణను బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. అవినాష్ ఎలిమినెట్ అయ్యే ఛాన్స్ ఉందని, అతడిని కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అతిథిగా ప్రవేశించి హౌస్ నుంచి బయటకు తీసుకొస్తారనే చర్చ జరుగుతోంది.
విన్నర్ ఖరారయ్యారా..
ఈ క్రమంలో ట్రోఫీ కోసం నిఖిల్, గౌతమ్ మధ్య ఫైనల్ పోటీ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య పోటీ గట్టిగా ఉండొచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇద్దరు పోటీదారులకు దాదాపు సమాన సంఖ్యలో ఓట్లు వచ్చాయనే టాక్ నడుస్తోంది.
కానీ చివరకు టైటిల్ నిఖిల్ గెల్చుకునే ఛాన్స్ ఉందని కొందరు అంచనా వేస్తుండగా.. తెలుగు కుర్రాడు గౌతమ్ టైటిల్ గెలుచుకునే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. తెలుగు కుర్రాడు కావడంతో పాటు.. ఇది తెలుగు షో కావడంతో గౌతమ్‌కు ఆడియన్స్ ఓట్లు ఎక్కువుగా వచ్చినట్లు తెలుస్తోంది. అసలు ఈ ఇద్దరిలో అసలు విజేత ఎవరనే ఉత్కంఠకు తెరపడాలంటే మరికొన్ని గంటలు వేచిచూడాల్సిందే. విజేతకు ఫ్రైజ్ మనీగా రూ. 55 లక్షలు, ఒక విలాసవంతమైన కారును అందజేయనున్నట్లు తెలుస్తోంది. రాత్రి 7 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
నోట్: ఈ వార్త కేవలం పలువురు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, సోషల్ మీడియా లీక్స్ ఆధారంగా అంచనావేసి రాసినది మాత్రమే. తుది విజేత ఎవరనేది షో ఫైనల్ ఎపిసోడ్‌లో తేలనుంది.
Also Read:
Bigg Boss Telugu 8 Grand Finale: బిగ్‌బాస్ ఫినాలేకు విష్ణుప్రియ సహా ఇద్దరు డుమ్మా.. రీజన్ ఇదే..
ఈ పోలీసు అతి తెలివి మామూలుగా లేదుగా.. చలికి తట్టుకోలేక ఖైదీతో..
సింహాన్ని చుట్టేసిన కొండచిలువ.. చివరికి ఏమైందో చూస్తే కళ్లు తేలేస్తారు..
వామ్మో.. ఇదేంటీ.. చలి నుంచి తప్పించుకోవాలని మంటపై పడుకున్న వ్యక్తి.. చివరికి జరిగింది చూస్తే..
For More Prathyekam And Telugu News
Updated Date - Dec 15 , 2024 | 04:47 PM