ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: 5 రూపాయలతో 50 కిలోమీటర్లు.. బీహార్ కుర్రాడు తయారు చేసిన ఈ వెరైటీ బైక్ స్పెషాలిటీ ఏంటంటే..

ABN, Publish Date - Sep 27 , 2024 | 01:34 PM

అవసరం కొత్త ఆవిష్కరణలకు కారణమవుతుంది. కొందరు వ్యక్తులు పెద్ద సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలు ఎన్నో సరికొత్త వాహనాల రాకకు కారణమవుతున్నాయి. బీహార్‌కు చెందిన ఓ కుర్రాడు పాత సామాన్లతో ఓ వినూత్న బైక్‌ను రూపొందించాడు.

Bihar boy made a jugaad bike

అవసరం కొత్త ఆవిష్కరణలకు (Innovation) కారణమవుతుంది. కొందరు వ్యక్తులు పెద్ద సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలు (Petrol Rates) ఎన్నో సరికొత్త వాహనాల రాకకు కారణమవుతున్నాయి. తాజాగా బీహార్‌ (Bihar)కు చెందిన ఓ కుర్రాడు పాత సామాన్లతో ఓ వినూత్న బైక్‌ను రూపొందించాడు. ఆ బైక్ (EV Bike) అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


jiteshkumar8134 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కుర్రాడు తాను తయారు చేసిన బైక్ గురించి వివరించాడు. బైక్ మధ్యలో పొడవాటి సిలిండర్ లాంటిది ఉంది. దానిపై సీటును అమర్చారు. దానికి సైకిల్ పెడల్స్ అమర్చారు. చిన్న టైర్లు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిసిటీతో ఆ బైక్ నడుస్తుంది. తనకు అందుబాటులో ఉన్న పాత వస్తువులతోనే ఆ బైక్‌ను తయారు చేసినట్టు ఆ కుర్రాడు తెలియజేశాడు. ఈ బైక్ యాభై కిలోమీటర్లు నడిచేందుకు అయ్యే ఖర్చు ఐదు రూపాయలే. ఈ బైక్‌ను దొంగిలించడం అంత సులభం కాదు. ఎవరైనా ఈ బైక్ తాళం తెరవడానికి ప్రయత్నిస్తే సైరన్ మోగుతుంది.


ఈ వ్యక్తి తన బైక్‌కు తేజస్ అని పేరు పెట్టాడు. తేజస్ అనే పేరు దేశ గౌరవాన్ని పెంచుతుందని చెబుతున్నాడు. ఈ వైరల్ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 1.3 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఈ బైక్ బాగుంది``, ``ఆ బైక్ మీద 50 కి.మీ. ప్రయాణించడం కష్టం``, ``బీహారీలు చాలా స్మార్ట్. చాలా హార్డ్ వర్కింగ్``, ``ఆ కుర్రాడు చాలా తెలివైనవాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: తెలివంటే ఇదీ.. బైక్ ఇంజిన్, ఫ్యాన్‌తో వినూత్న వాహనం.. గాల్లోకి ఎగిరే చౌకైన విహంగం..


Viral Video: వావ్.. హిప్పోలు కూడా ఇంత బుద్ధిగా ఉంటాయా? పళ్లు తోముతుంటే హిప్పో ఏం చేసిందో చూడండి..


Viral News: 11 సంవత్సరాల తర్వాత ఇంటికొచ్చాడు.. అసలేం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..


Picture Puzzle: మీరు పజిల్ స్పెషలిస్టులా?.. ఈ వర్డ్ పజిల్‌లోని ``IRON``ను 8 సెకెన్లలో కనుక్కోండి...


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 27 , 2024 | 01:34 PM