Shocking Video: రోడ్డుపై స్టైల్‌గా బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి.. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఏం జరిగిందంటే..
ABN, Publish Date - May 16 , 2024 | 04:08 PM
వేసవిలో పగటి పూట ఉండే వేడికి వాహనాలు మంటల్లో చిక్కుకోవడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయినపుడు బైక్ నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక, ఇటీవల ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెరగడం కూడా ఈ అగ్ని ప్రమాదాలకు కారణమవుతోంది.
వేసవిలో (Summer) పగటి పూట ఉండే వేడికి వాహనాలు మంటల్లో చిక్కుకోవడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయినపుడు బైక్ నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక, ఇటీవల ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెరగడం కూడా ఈ అగ్ని ప్రమాదాలకు కారణమవుతోంది. బ్యాటరీలు పేలి ప్రమాదాలు సంభవించిన ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. అయితే తాజాగా జరిగిన ఘటన మాత్రం పూర్తిగా భిన్నం. vashusingh123 అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక వ్యక్తి పసుపు రంగు బైక్ (Bike) మీద రోడ్డుపై వెళుతున్నాడు. గాగుల్స్, బ్యాగ్ ధరించి స్టైల్‌గా బైక్ మీద వెళ్తున్నాడు. అతడు తన బైక్ యాక్సిలరేటర్ రైజ్ చేయగానే ఒక్కసారిగా బైక్ టైర్ దగ్గర మంటలు (Fire) చెలరేగాయి. వేగంగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలను సకాలంలో గుర్తించిన ఆ వ్యక్తి వెంటనే బైక్‌ను కింద పడేసి పారిపోయాడు. దీంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Bike catches fire).
ఈ వీడియోకు కోట్లలో వ్యూస్ వచ్చాయి. దాదాపు 8 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``బైక్‌లో పలు మార్పులు చేయడమే ఈ ప్రమాదానికి కారణం``, ``పెట్రోల్ లీక్ అవుతుందేమో``, ``వీడియో కోసం అలా చేశారేమో``, ``ఉన్నట్టుండి మంటలు ఎక్కడి నుంచి వచ్చాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూాడా చదవండి..
Viral: పోలీసుల దెబ్బకు ఆడీ కారులో హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్న వ్యక్తి.. అసలు కథేంటో తెలిస్తే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 16 , 2024 | 04:08 PM