Viral Video: ఇదెక్కడి బైక్.. రీల్స్ కోసం బైక్‌ను ఎలా మార్చారో చూడండి.. ఒక్క చిన్న తప్పు జరిగితే..
ABN, Publish Date - Sep 04 , 2024 | 02:47 PM
ప్రస్తుతం చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరికీ సోషల్ మీడియా పిచ్చి విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. విభిన్నమైన వీడియోలు రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరికీ సోషల్ మీడియా (Social Media) పిచ్చి విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. విభిన్నమైన వీడియోలు రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం అవసరతమైతే తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ముఖ్యంగా జుగాడ్ పేరుతో కొందరు వ్యక్తులు పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తున్నారు (Jugaad Video). ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. artist.bsyt అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో కొంతమంది అబ్బాయిలు బైక్ (Bike) మీద వెళ్తున్నారు. ఒకే బైక్‌పై ఆరుగురు కూర్చుని జాలీగా రైడ్ చేశారు. బైక్‌ను డబుల్ డెక్కర్ బస్సులా మార్చేశారు. బైక్‌పై ఓ ఐరన్ నిర్మాణాన్ని పెట్టారు. బైక్ సీటుపై ముగ్గురు అబ్బాయిలు కూర్చుంటే, వారి పైన ఐరన్ రాడ్‌లపై మరో ముగ్గురు అబ్బాయిలు కూర్చున్నారు. అందరూ ఖాళీ రోడ్డుపై జాలీగా రైడ్ చేశారు (Double decker bike). వారి రైడ్‌ను వేరే వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకు 69 లక్షలకు పైగా వీక్షించారు. దాదాపు 2.4 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేసారు. ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ``చిన్న తప్పు జరిగితే ఆట ముగుస్తుంది``, ``రీల్స్ కోసం ఇంత రిస్క్ ఎందుకు``, ``ఆలోచన బాగుంది``, ``ఇది స్ప్లెండర్ ప్లస్ పవర్``, ``డబుల్ డెక్కర్ బైక్``, ``బ్యాలెన్స్ తప్పితే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: అందమే కాదు.. ధైర్యం కూడా ఈమె సొత్తే.. భారీ సర్పాన్ని పట్టుకుని ఈమె ఏం చేసిందో చూడండి..
Viral Video: ఈ మ్యాచ్‌ను దేవుడు కూడా ఎంజాయ్ చేస్తాడట.. కామెంటరీ వింటే షాక్‌తో నోరెళ్లబెట్టాల్సిందే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 04 , 2024 | 02:47 PM