ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: శరీర దుర్వాసన వస్తోందంటూ నల్లజాతీయుల్ని దింపేసిన ఎయిర్ లైన్స్!

ABN, Publish Date - Jun 01 , 2024 | 06:33 PM

అమెరికన్ ఎయిర్ లైన్స్ పై ముగ్గురు నల్లజాతీయులు కోర్టుకెక్కారు. తమపై జాత్యాహంకారం ప్రదర్శిస్తూ విమానం నుంచి దింపేశారని ఆరోపించారు. ఎవరో ఓ నల్ల జాతి వ్యక్తి నుంచి శరీర దుర్వాసన రావడంతో విమానంలో ఉన్న ఎనిమిది మంది నల్లజాతీయులనూ బలవంతంగా దింపేశారని ఆరోపించారు.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికన్ ఎయిర్ లైన్స్ పై (American Airlines) ముగ్గురు నల్లజాతీయులు కోర్టుకెక్కారు. తమపై జాత్యాహంకారం ప్రదర్శిస్తూ విమానం నుంచి దింపేశారని ఆరోపించారు. ఎవరో ఓ నల్ల జాతి వ్యక్తి నుంచి శరీర దుర్వాసన రావడంతో విమానంలో ఉన్న ఎనిమిది మంది నల్లజాతీయులనూ బలవంతంగా దింపేశారని ఆరోపించారు. అమెరికాలో ఈ ఉదంతం కలకలం రేపుతోంది.

బాధితుల కథనం ప్రకారం, జనవరి 5న ఫినిక్స్ నుంచి న్యూయార్క్‌కు వెళ్లే విమానంలో ఈ ఘటన జరిగింది. తొలుత శ్వేతజాతీయురాలైన ఎయిర్ హోస్టస్ ఓ నల్లజాతి వ్యక్తి నుంచి శరీర దుర్వాసన వస్తోందని ఫిర్యాదు చేసింది. కానీ, అతడు ఎవరనేది మాత్రం గుర్తించలేకపోయింది. ఈ క్రమంలో విమానంలో ఉన్న తమతో పాటు మరో ఐదుగురు నల్లజాతీయులను దింపేశారని వారు ఆరోపించారు. ఎవరో ఒకరి దగ్గర దుర్వాసన వస్తే నల్లజాతీయులందరినీ విమానం నుంచి దింపేడం జాత్యాహంకారమని వారు ఆరోపించారు. తామందరం వేర్వేరు సీట్లలో దూరంగా కూర్చున్న విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు (Black Passengers Ordered To Deboard Flight Citing Body Odour Sue US Airline).

Viral: రైళ్లల్లో వెళ్లే వాళ్లు జాగ్రత్త! ఈ దొంగ ఫోన్ కొట్టేసిన తీరు చూస్తే..


మళ్లీ టిక్కెట్లు కొనుక్కుని మరో విమానంలో వెళ్లాలని కూడా తమకు సూచించినట్టు ఆ ముగ్గురూ చెప్పుకొచ్చారు. అయితే, ఇతర విమాన సర్వీసులు ఏవీ లేకపోవడంతో చివరకు తమను అదే విమానంలో వెళ్లనిచ్చారని పేర్కొన్నారు. ఈ ఘటన కారణంగా విమానం గంట పాటు ఆలస్యంగా బయలుదేరిందని పేర్కొన్నారు.

ఈ ఘటన తమకు మానసిక వేదన మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుల తరుపు న్యాయవాది మాట్లాడుతూ.. శరీర దుర్వాసనకు సంబంధించిన ఫిర్యాదు వచ్చినప్పుడు దానిపై విచారణ జరపాలని అన్నారు. సమస్యకు కారకులు ఎవరో గుర్తించాలని అన్నారు. ఎయిర్ లైన్స్ సంస్థ ఇవేమీ చేయకుండానే నల్లజాతి వారిని కిందకు దిగమనడం తప్పని స్పష్టం చేశారు.

Read Viral and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 06:41 PM

Advertising
Advertising