ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఇలాంటి వాడి బైక్ ఎక్కిన ఆ అమ్మాయి ధైర్యానికి హ్యాట్సాఫ్.. వైరల్ అవుతున్న ప్రమాదకర స్టంట్ వీడియో!

ABN, Publish Date - Jun 15 , 2024 | 10:54 AM

ప్రస్తుత డిజిటిల్ యుగంలో చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకే ప్రయత్నిస్తున్నారు. ఆ విషయంలో జనాల మధ్యన ఓ పోటీయే జరుగుతున్నట్టుంది. వ్యూస్, లైక్స్ విషయంలో పోటీ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రమాదకర సాహసాలు చేస్తూ ఇతరులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు

Bike stunt

ప్రస్తుత డిజిటిల్ యుగంలో చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకే ప్రయత్నిస్తున్నారు. ఆ విషయంలో జనాల మధ్యన ఓ పోటీయే జరుగుతున్నట్టుంది. వ్యూస్, లైక్స్ విషయంలో పోటీ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రమాదకర సాహసాలు చేస్తూ ఇతరులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా పోయింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే భయపడక తప్పదు (Viral Video).


itx_toxic_sa అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువ జంట బైక్ (Bike) మీద రోడ్డుపై వెళ్తోంది (Bike stunt). ఉన్నట్టుండి ఆ యువకుడు బైక్‌ ముందు చక్రాన్ని పైకి లేపాడు. వెనుక చక్రం మీదనే బైక్‌ను నడిపించాడు. ఆ యువకుడి వెనుక కూర్చున్న అమ్మాయి ఏ మాత్రం భయపడకుండా అతడిని పట్టుకుని కూర్చుంది. ఆ అమ్మాయి మాస్క్ వేసుకుని కూర్చుంది. వారిద్దరూ నడిరోడ్డుపై ఆ స్టంట్ చేస్తుండగా వారి స్నేహితుడు వీడియో చిత్రీకరించాడు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 9 లక్షల మందికి పైగా వీక్షించారు. 22 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారేమో``, ``ఆ అమ్మాయి ధైర్యానికి హ్యాట్సాఫ్``, ``ఆ అమ్మాయి తండ్రి ఆ వీడియో చూసి ఎలా రియాక్ట్ అవుతారో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: మీ కళ్లకు నిజమైన పరీక్ష.. ఈ ఫొటోలో ఉన్న తప్పేంటో 10 సెకెన్లలో కనుక్కోండి..!


Pawan Kalyan: పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజ్‌నెవా గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? ఆమె ఆస్తులు విలువ ఎంతంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 15 , 2024 | 11:19 AM

Advertising
Advertising