ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఓవరాక్షన్ చేస్తే ఇలాగే ఉంటుంది.. కార్ వెనుక స్టంట్ చేయడానికి ప్రయత్నించి ఎలా బోల్తా పడ్డాడో చూడండి..

ABN, Publish Date - May 13 , 2024 | 04:35 PM

ప్రస్తుత డిజిటల్ యుగంలో వ్యూస్, లైక్స్‌కు విపరీతంగా ప్రాధాన్యం పెరిగిపోయింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం జనాలు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ప్రజలు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రమాదకర స్టంట్లు చేస్తున్నారు. వాటి పర్యవసానాలు కొన్నిసార్లు చాలా ప్రమాదకరమైనవిగా మారుతున్నాయి.

stunt

ప్రస్తుత డిజిటల్ యుగంలో వ్యూస్, లైక్స్‌కు విపరీతంగా ప్రాధాన్యం పెరిగిపోయింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reels) కోసం జనాలు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ప్రజలు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రమాదకర స్టంట్లు చేస్తున్నారు (Stunt Videos). వాటి పర్యవసానాలు కొన్నిసార్లు చాలా ప్రమాదకరమైనవిగా మారుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ కుర్రాడు నడిరోడ్డుపై ప్రమాదకరంగా స్కేటింగ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు (Viral Video).


@nikkym143 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కుర్రాడు స్కేటింగ్ (Skating) షూస్ ధరించి రోడ్డుపైకి వచ్చాడు. రోడ్డుపై వెళ్తున్న ఓ కారును (Car) పట్టుకుని దాని వెనుక వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే బ్యాలెన్స్ తప్పి పోయి కింద పడిపోయాడు. ఆ వేగానికి పలుసార్లు పల్టీలు కొట్టుకుంటూ ముందుకు వెళ్లాడు. ఆ సమయంలో వెనుక ఏమీ వాహనాలు రాకపోవడంతో ఆ కుర్రాడికి పెద్ద ప్రమాదం తప్పింది.


బైక్ మీద వస్తున్న అతని ఫ్రెండ్స్ ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను దాదాపు 3.7 లక్షల మంది వీక్షించారు. ఎంతో మంది ఈ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. ``ఇలాంటి రిస్క్‌లు ఎవరూ చేయకూడదు``, ``ఇలా రిస్క్‌లు చేసి లైఫ్ గేమ్‌లో ఓడిపోకండి``, ``ఆ కుర్రాడికి కౌన్సిలింగ్ అవసరం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ వ్యక్తి తెలివి తేటలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. కారులో చెరుకు రసం మెషిన్ ఎలా సెట్ చేశాడో చూడండి..


Puzzle: మీ సామర్థ్యానికి పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు ముఖ్యమైన తేడాలను కనిపెట్టండి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 13 , 2024 | 04:35 PM

Advertising
Advertising