ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఆ యువతి ధైర్యానికి హ్యాట్సాఫ్.. ఆమె వెంటనే స్పందించకపోతే పెద్ద ప్రమాదమే.. షాకింగ్ వీడియో వైరల్!

ABN, Publish Date - Aug 06 , 2024 | 08:08 PM

ఏదైనా వాహనాన్ని పార్క్ చేసేటపుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హ్యాండ్ బ్రేక్ తప్పనిసరిగా వేయాలి. రోడ్డు ఏటవాలుగా ఉంటే చక్రాల ముందు రాళ్లు కూడా పెట్టాలి. లేకపోతే వాహనాలు వాటంతట అవే ముందుకు వెళ్లిపోయి భారీ ప్రమాదాలకు కారణమవుతాయి. వెంటనే ఎవరైనా స్పందించకపోతే భారీ నష్టం తప్పదు.

Truck

ఏదైనా వాహనాన్ని పార్క్ (Parking) చేసేటపుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హ్యాండ్ బ్రేక్ (Hand Brake) తప్పనిసరిగా వేయాలి. రోడ్డు ఏటవాలుగా ఉంటే చక్రాల ముందు రాళ్లు కూడా పెట్టాలి. లేకపోతే వాహనాలు వాటంతట అవే ముందుకు వెళ్లిపోయి భారీ ప్రమాదాలకు కారణమవుతాయి. వెంటనే ఎవరైనా స్పందించకపోతే భారీ నష్టం తప్పదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో అలాంటి ఘటనే జరిగింది. అయితే ఓ అమ్మాయి ధైర్యంగా ముందుకు రావడంతో ప్రమాదం తప్పింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


@gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ట్రక్ (Truck) ఆగి ఉంది. వెనుక ఇద్దరు వ్యక్తులు దానిని రిపేర్ చేస్తున్నారు. పక్కనే ఓ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో ఆ ట్రక్ కదలడం మొదలైంది. రోడ్డు వైపు వెళ్తోంది. వెంటనే స్పందించిన అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్లి ట్రక్ ఎక్కి హ్యాండ్ బ్రేక్ వేసింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎందుకంటే ఆ సమయంలో రోడ్డుపై చాలా వాహనాలు వెళ్తున్నాయి. ఆ అమ్మాయి తన తెలివి, ధైర్య సాహసాలతో పెను ప్రమాదాన్ని నివారించింది.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను 9.4 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. దాదాపు 8 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోలోని యువతిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ``ఇది దైర్యవంతుల లక్షణం``, ``కొందరు ఎటువంటి పరిస్థితి ఎదురైనా సిద్ధంగా ఉంటారు``, ``ఆ అమ్మాయి చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: పెళ్లిలో పురోహితుడి చేయి పట్టుకున్న వధువు.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!


Viral: కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన వ్యక్తి.. అతడు చెప్పింది విని వెంటనే ఆపరేషన్ చేసి షాకైన డాక్టర్లు!


Optical Illusion: మీ కళ్లకు నిజమైన పరీక్ష.. ఈ ఫొటోలోని క్యారెట్ల మధ్య ఉన్న పెన్సిల్‌ను 10 సెకెన్లలో పట్టుకోండి!


Viral: ఇదెక్కడి విడ్డూరం.. తలలో పేను ఉందని విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అసలేం జరిగిందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 06 , 2024 | 08:08 PM

Advertising
Advertising
<