ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: పెళ్లిలో వరుడి కంట కన్నీరు.. డాక్టర్ వధువుకు అతడిపై డౌటొచ్చి..

ABN, Publish Date - Mar 12 , 2024 | 07:33 PM

పెళ్లిలో వరుడి తీరును గమనిస్తున్న వధువుకు అనుమానం మొదలైంది. ఆ తరువాత అతడి కంట కన్నీరు చూశాక తన అనుమానం నిజమని తేలడంతో పెళ్లి రద్దు చేసుకుంది.

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లిలో వరుడి తీరును గమనిస్తున్న ఓ డాక్టర్ వధువుకు అనుమానం మొదలైంది. ఆ తరువాత అతడి కంట కన్నీరు చూశాక తన అనుమానం నిజమని తేలడంతో పెళ్లి రద్దు చేసుకుంది. హర్యానాలో (Haryana) వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగానే కాకుండా నెట్టింట కూడా చర్చనీయాంశమవుతోంది (Trending).

Viral: 50 ఏళ్లుగా కోకోకోలా తప్ప చుక్క నీరు కూడా తాగలేదు.. చివరకు ఇతడి పరిస్థితి ఏమైందో తెలిస్తే..


మోహిందర్‌గఢ్ ప్రాంతానికి చెందిన ఓ వైద్యురాలికి ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. గురువారం ముహూర్తం కావడంతో వరుడు సంప్రదాయ పద్ధతిలో ఊరేగింపుగా మండపానికి వచ్చాడు. ఇతర క్రతువులన్నీ యథాతథంగా జరగసాగాయి. ఇంతలో వధువు బంధువుల దృష్టి ఓ అతిథిపై పడింది. ఆమె నిత్యం వరుడి పక్కనే ఉండటంతో వధువు కుటుంబ సభ్యుల్లో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆమె ఎవరని వాకబు చేయగా తనకు వరుసకు సోదరి అవుతుందని వరుడు చెప్పుకొచ్చాడు.

Viral: కిడ్నీ అమ్ముదామనుకున్న చార్టర్డ్ అకౌంటెంట్.. ఒక కిడ్నీకి రూ.2 కోట్లు వస్తాయని తెలిసి..

కానీ ముహూర్తం దగ్గర పడే కొద్దీ వరుడితో పాటూ ఆమె ముఖంలో విషాదఛాయలు కనిపించాయి. వధువు కూడా ఇది గమనించింది. ఈలోపు వధువు బంధువులు ఎంక్వైరీ చేయగా ఆమె వరుడి గర్ల్‌ఫ్రెండ్ (Groom’s Girlfriend) అని తేలింది. మరోవైపు, వరుడు, అతడితో పాటు ఉన్న యువతి కన్నీరు కార్చడం వధువు కంట్లో పడింది. ఈలోపు బంధువులు వధువు వద్దకు వచ్చి ఆ యువతి వరుడి గర్ల్‌ఫ్రెండ్ అని చెప్పేశారు. దీంతో, వధువుకు కోపం నషాళానికి అంటి వెంటనే వివాహాన్ని రద్దు చేసుకుంది (Bride calls off marriage as groom’s girlfriend attends wedding).

Viral: ఫుల్‌గా ఎంజాయ్ చేద్దామని రైల్లో విండో సీట్ బుక్ చేసుకుంటే షాక్.. చివరకు ఊహించని విధంగా..


ఈ విషయంలో వధూవరుల కుటుంబసభ్యుల మధ్య వివాదం మొదలైంది. వధువు తమ కుమారుడికి తగిన జీవతభాగస్వామి అని భావించి పెళ్లికి సిద్ధమైనట్టు అతడి కుటుంబసభ్యులు చెప్పుకొచ్చారు. వధువుకు, ఆమె కుటుంబసభ్యులకు క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా, ఇప్పటివరకూ పెళ్లి ఏర్పాట్లకైన ఖర్చు మొత్తం చెల్లించేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో రూ.25 లక్షలకు ఇద్దరి మధ్య అంగీకారం కుదరడంతో ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2024 | 07:41 PM

Advertising
Advertising