ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పాపం.. ఆ వరుడి పరిస్థితి చూస్తే జాలేస్తుంది.. వేదిక మీద డ్రమ్మర్‌తో వధువు డ్యాన్స్ చూస్తే..

ABN, Publish Date - Oct 12 , 2024 | 03:25 PM

సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. పెళ్లిళ్లలో జరిగే ఆసక్తికర దృశ్యాలు, ఫన్నీ ఘటనలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఓ వీడియో చూసిన వారెవ్వరూ నవ్వు ఆపుకోలేరు.

Bride funny dance

సోషల్ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన వీడియోలు (Wedding Videos) బాగా వైరల్ అవుతున్నాయి. పెళ్లిళ్లలో జరిగే ఆసక్తికర దృశ్యాలు, ఫన్నీ ఘటనలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఓ వీడియో చూసిన వారెవ్వరూ నవ్వు ఆపుకోలేరు. ఆ వీడియోలోని వధువు (Bride) ప్రవర్తన, ఆమె డ్యాన్స్ చాలా మందికి షాక్ కలిగిస్తోంది. vishakha_chaudhary అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ పెళ్లి వేడుకలో వధూవరులు తమ బంధుమిత్రులతో కలిసి వేదిక పైకి ఎక్కారు. ఆ సమయంలో అక్కడ ఓ డ్రమ్మర్ అద్భుతంగా డ్రమ్స్ ప్లే చేస్తున్నాడు. దాంతో వధువు డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ట్యూన్‌కు అనుగుణంగా వేగంగా డ్యాన్స్ చేస్తూ తన్మయత్వానికి లోనైంది. చుట్టూ ఎవరు ఉన్నారో పట్టించుకోకుండా డ్రమ్మర్ మెడపై చేతులు వేసి అతడితో కలిసి డ్యాన్స్ వేసింది. వధువు ప్రవర్తన చూసి చుట్టూ ఉన్న వారు షాకయ్యారు. అయినా ఆ వధువు ఎవరినీ పట్టించుకోకుండా వేదిక అంతా తిరుగుతూ డ్యాన్స్ చేస్తూనే ఉంది. చివరకు వరుడు వచ్చి వధువును పట్టుకుని తీసుకెళ్లాడు.


ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 20 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 2.6 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఈ డ్యాన్స్ కార్యక్రమం తర్వాత ఆ పెళ్లి జరిగిందా``, ``అయ్యో దేవా, వరుడికి ఎంత అన్యాయం జరిగింది``, ``ఆమెకు డ్యాన్స్ అంటే విపరీతమైన ఇష్టంలా ఉంది``, ``పాపం.. వరుడి పరిస్థితి ఏంటి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 12 , 2024 | 03:25 PM