Viral Video: ఆఖరికి రిక్షాను కూడా వదల్లేదు.. రిక్షాలో వెళుతూ వధువు డ్యాన్స్.. రిక్షా పుల్లర్ పరిస్థితి ఏంటంటే..
ABN, Publish Date - Jul 06 , 2024 | 12:19 PM
ప్రస్తుతం పెళ్లి వేడుక అనగానే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అనేది తప్పనిసరిగా మారిపోయింది. పెళ్లికి ముందు వధువు, వరుడు కలిసి రకరకాల థీమ్‌లతో ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. అందుకోసం అందమైన లోకేషన్లకు వెళుతుంటారు. సముద్ర తీరంలో, మంచు ప్రాంతాల్లో, ప్రకృతి ఒడిలో ఫొటోషూట్‌లు చేసుకుంటారు.
ప్రస్తుతం పెళ్లి వేడుక (Marriage) అనగానే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ (Pre-wedding photoshoot) అనేది తప్పనిసరిగా మారిపోయింది. పెళ్లికి ముందు వధువు (Birde), వరుడు (Groom) కలిసి రకరకాల థీమ్‌లతో ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. అందుకోసం అందమైన లోకేషన్లకు వెళుతుంటారు. సముద్ర తీరంలో, మంచు ప్రాంతాల్లో, ప్రకృతి ఒడిలో ఫొటోషూట్‌లు చేసుకుంటారు. అయితే ఓ వధువు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించింది. బిజీ రోడ్డుపై రిక్షా (Rickshaw)లో వెళుతూ ఫొటోషూట్‌లో పాల్గొంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. వీడియోపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు (Viral Video).
aashi_nanda అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వధువు లెహంగా, నగలు ధరించి రిక్షా మీద కూర్చుని ఉంది. ఆమె మొదట రిక్షాలో కూర్చొని డ్యాన్స్ చేయడం ప్రారంభించి, ఆపై నిలబడి నృత్యం చేసింది. రిక్షా మెల్లిగా వెళుతుండగా వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు తమ పని తాము చేసుకుంటున్నారు. ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో ``బడో బడి`` అనే హిందీ పాట ప్లే అవుతుండడంతో ఈ వీడియో చాలా ఫన్నీగా తయారైంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 7 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. ``ఆ రిక్షా పుల్లర్‌కు కూడా మంచి బట్టలు కొని ఇవ్వవచ్చు కదా``, ``ఆ రిక్షా పుల్లర్‌కు ఏమీ అర్థం కావడం లేదు``, ``పెళ్లి తర్వాత ఎక్కాల్సింది ఇదే``, ``ఇలాంటి ఆలోచన ఎవరికి వచ్చిందో``, ``లో బడ్జెట్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral: వామ్మో.. తనను కరిచిన పామును తిరిగి కరిచాడు.. తర్వాతేం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Puzzle: మీరు లాజికల్‌గా ఆలోచించగలరా? అయితే ఈ ఫొటోలో ఉన్న తప్పును 10 సెకెన్లలో కనిపెట్టండి!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 06 , 2024 | 12:19 PM