Viral: పెళ్లిరోజు షాకిచ్చిన వధువు.. తన మాజీ భర్తను తోడుగా తీసుకురావాలంటూ.. ఏకంగా వరుడికే చెప్పడంతో.. చివరకు..
ABN, Publish Date - Mar 08 , 2024 | 08:14 PM
వివాహ సమయాల్లో చోటు చేసుకునే షాకింగ్ ఘటనలకు సంబంధించిన వార్తలు ఇటీవల తెగ వైరల్ అవుతున్నాయి. వధూవరుల మధ్య చోటు చేసుకునే విచిత్ర ఘటనలకు సంబంధించిన వార్తలు, ఫొటోలు, వీడియోలు.. ఇట్టే నెట్టింట్లోకి వచ్చి చేరుతున్నాయి. వీటిలో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని అవాక్కయ్యేలా చేస్తుంటాయి. ఇంకొన్ని మాత్రం...
వివాహ సమయాల్లో చోటు చేసుకునే షాకింగ్ ఘటనలకు సంబంధించిన వార్తలు ఇటీవల తెగ వైరల్ అవుతున్నాయి. వధూవరుల మధ్య చోటు చేసుకునే విచిత్ర ఘటనలకు సంబంధించిన వార్తలు, ఫొటోలు, వీడియోలు.. ఇట్టే నెట్టింట్లోకి వచ్చి చేరుతున్నాయి. వీటిలో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని అవాక్కయ్యేలా చేస్తుంటాయి. ఇంకొన్ని మాత్రం అందరినీ ఆలోచింపజేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వార్త ఒకటి తెగ వైరల్ అవుతోంది. తన మాజీ భర్తను తీసుకురావాలని ఓ వధువు.. నేరుగా వరుడికే చెప్పింది. చివరకు కారణం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ వైరల్ అవుతోంది. క్రిస్ అనే 36 ఏళ్ల మహిళకు 2006లో తన చిన్ననాటి స్నేహితుడైన బ్రాండన్ అనే వ్యక్తితో వివాహమైంది. అయితే పెళ్లి జరిగిన కొన్ని నెలలకే బ్రాండన్.. కారు ప్రమాదానికి గురయ్యాడు. దీని కారణంగా అతడి మానసిక పరిస్థితి పూర్తిగా క్షీణించింది. అయినా క్రిస్ మాత్రం భర్తను విడిచిపెట్టకుండా కంటికి రెప్పలా చూసుకునేంది. అయితే తదనంతర కాలంలో బ్రాండన్‌కు విడాకులు (Divorce) ఇచ్చి, దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ బ్రాండన్‌ని విడిచి దూరంగా ఉండడం ఆమె వల్ల కాలేదు.
Viral Video: వామ్మో..! ఇదెక్కడి ఆటరా బాబోయ్.. ఏకంగా ఎక్సకవేటర్‌తోనే..
జీవితాంతం తన భర్త యోగక్షేమాలు చూసుకుంటూ ఉండాలని నిర్ణయించుకుంది. అయితే ఈ క్రమంలో ఆమెకు ఇటీవల జేమ్స్ అనే వ్యక్తితో వివాహం (marriage) నిశ్చయమైంది. అయితే వివాహ సమయంలో వధువు.. వరుడితో జరిగిన విషయాన్ని తెలియజేసింది. తన మాజీ భర్త కూడా తమతో పాటూ ఉండేలా అంగీకరిస్తేనే పెళ్లి చేసుకుంటానని కండీషన్ పెట్టింది. ఈ మాటకు ముందుగా అతను షాకైనా.. తర్వాత క్రిస్ మనసు అర్థం చేసుకుని, మాజీ భర్తను తీసుకొచ్చేందుకు ఒప్పుకొన్నాడు. భార్య మాజీ భర్త యోగక్షేమాలు చూసుకునేందుకు అంగీకరించిన విషయం తెలుసుకుని.. పెళ్లికి వచ్చిన బంధువులంతా అతన్ని అభినందించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ నూతన జంట తీసుకున్న నిర్ణయంపై నెట్టింట కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది.
Viral Video: ఎంత స్లీపర్ కోచ్ అయితే మాత్రం మరీ ఇదేంటీ.. విచిత్రంగా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం..
Updated Date - Mar 08 , 2024 | 08:16 PM